పోలవరం కొర్రీలతో కాలక్షేపం

Centeral Government  delaying Polavaramపోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస వ్యయం పెరగడంతో కేంద్ర జలసంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిన విషయం తెలిసిందే. అయితే రా ష్ట్ర అధికారులు ఢిల్లీలోనే మకాం వేసి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా వివరణలు ఇచ్చినా కేంద్ర జలసంఘం కొత్త కొర్రీలు వేస్తూ సమయం దాటవేస్తుండటంతో కేంద్రం నిబద్ధతపై అనుమానాలు కలుగుతున్నాయి.

[m9ad]

ADVERTISEMENT

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే కుటుంబాలెన్ని.. తలసరిన ఒక్కో నిర్వాసితుడిపై చేసే వ్యయమెంత.. గృహ నిర్మాణానికెంత అవుతుంది.. కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రహదారులు, మంచినీటి సదుపాయం, విద్య, వైద్య సేవలు, పార్కులు, వాణిజ్య భవన సముదాయాలు, దేవాలయం, మసీదు, చర్చి వంటి ప్రార్థనా మందిరాల నిర్మాణానికి ఎంతెంత వ్యయం అవుతుంది..?

వీటన్నిటికీ సవివరంగా.. కేంద్ర ఫార్మాట్‌లో సమాధానాలివ్వాలని శుక్రవారం రాష్ట్ర జల వనరుల శాఖకు లేఖ పంపింది. అయితే ఇవన్నీ గతంలో అడిగిన ప్రశ్నలే అని, అడిగిన వాటినే మళ్ళీ మళ్ళీ కొత్త ఫార్మటులో అడుగుతున్నారని రాష్ట్ర అధికారులు వాపోతున్నారు. సర్లే చేసేది ఏముంది?… అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

ADVERTISEMENT
Latest Stories