
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి కోసం, దావోస్ లో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. ఈసారి 90 ‘s నాటి చంద్రబాబు ని చూస్తారు, చూపిస్తాను అంటూ బాబు పదేపదే రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపిస్తుండడంతో ఆనాటి బాబు విజనరీ ఏపీ అభివృద్ధి ప్రాణవాయువుగా మారుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు ఏపీ భవిష్యత్ తరం.
తన 2020 విజనరీ తో హైద్రాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన బాబు, ఇప్పుడు తన 2040 విజన్ తో అమరావతి రూపకల్పన చేపట్టారు. అందులో భాగంగా ఏపీ పారిశ్రామిక అభివృద్ధి బాబు ముందున్న ప్రధాన లక్ష్యం. ఏపీ పునర్నిర్మాణానికి 40 ఏళ్ళ తన రాజకీయ అనుభవం, 20 ఏళ్ళ తన ముందాలోచనను రాష్ట్ర పెట్టుబడిగా వాడుతున్నారు బాబు.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
అందుకు గాను రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి యువ నేతలతో కలిసి దావోస్ యాత్రకు శ్రీకారం చుట్టిన బాబు వెళ్లిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని తానూ చెప్పినట్టు 90 ‘s చంద్రబాబును ఏపీ ప్రజలకు మరో మారు పరిచయం చెయ్యాలని ఆశపడుతున్నారు.
గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీని ప్రమోట్ చేస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు బాబు. అలాగే ఉన్న కర్మ భూమికి, పుట్టిన జన్మ భూమికి సమ ప్రాధాన్యతనిస్తూ ఏపీ అభివృద్ధిలో చేయి చేయి కలపాలంటూ ఎన్నారై లకు సూచనలు చేస్తున్నారు బాబు. ఇక ఇటు గ్లోబల్ టాలెంట్ హబ్ గా ఏపీని మారుస్తామంటూ లోకేష్ రాష్ట్రంలో AI కు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు.
Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..
అయితే ఏపీ ప్రభుత్వం తరుపున బాబు, లోకేష్ దావోస్ లో పెట్టుబడుల వేట కొనసాగిస్తుంటే అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హైద్రాబాద్ అభివృద్ధి విస్తరణలో తమ మార్క్ చూపించడానికి తహతహలాడుతున్నారు. ప్రపంచహములో అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు హైద్రాబాద్ లో ఉండాలని ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ రేవంత్ పెట్టుబడిదారులను తమ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు.
దావోస్ లో హీరో మోటర్ కార్ప్ నిర్వహించిన రౌండ్ టేబుల్ లో పాల్గొన్న సీఎం రేవంత్ హైదరాబాద్ లో దాదాపు 100 కి.మీ లకు పైగా కొత్త మెట్రో లైన్ల నిర్మాణం, ORR బయట 360 కి.మీ ప్రాంతీయ రింగ్ రోడ్, ఈ రెండిటిని కలుపుతూ రేడియల్ రోడ్లు, రింగ్ రైల్వే లైన్ లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ హైద్రాబాద్ అభివృద్ధిని మరింత విస్తరించడమే తమ మొదటి ప్రాధాన్యత అంటూ హైద్రాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలంటూ తమ అభ్యర్థనలను పారిశ్రామిక వేత్తల ముందు పరిచారు రేవంత్.
Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?
ఇలా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రజలు తమ కిచ్చిన ఈ ఐదేళ్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధిలో తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఒకరు, అభివృద్ధి విస్తరణలో తమ మార్క్ పాలన చూపించాలని ఒకరు శ్రమిస్తున్నారు. మరి ఇందులో ఎవరి ఆశలు నెరవేరినా తెలుగు ప్రజలకు తమ సొంత రాష్ట్రంలో మరిన్ని ఉపాధి అవకాశాలు దక్కినట్టే అవుతుంది.