మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మోడీ తలచుకుంటే మరో మూడు, నాలుగు నెలల ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇటీవల విడుదలైన సర్వే ఫలితాల ప్రకారం అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, ఎన్నికలకు ఇంకా సమయం ఉంది గనుక, రాబోయే ఆరు నెలల సమయం ఏపీ రాజకీయాలలో చోటు చేసుకోబోయే కీలకమైన పరిణామాలే ఫలితాలను నిర్దేశిస్తాయి.
చంద్రబాబును అష్టదిగ్బంధనం చేయడానికి అందరూ ఒక్క తాటిపైకి వస్తూ విమర్శలు చేస్తుండడంతో… ముఖ్యంగా రాబోయే ఆరు నెలలు బాబు సర్కార్ ఏ మాత్రం రిలాక్స్ అయినా, సర్వే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే గత ఎన్నికలలో కూడా ఇదే జరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ సింపతీతో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యం అన్నాయి చాలా సర్వే ఫలితాలు. కానీ అనూహ్యంగా చివరి ఏడాదిలో మొత్తం తారుమారైపోయాయి.
రాష్ట్ర విభజనకు ముందు నుండి టిడిపికి ఫేవర్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ అధికారం కైవసం చేసుకుంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ కు సర్వేలు ఎలా అయితే ఫేవర్ గా చెప్పాయో, ప్రస్తుతం చంద్రబాబుకు కూడా అంతే ఫేవర్ గా చెప్తున్నాయి. ఇక్కడే మరింత జాగ్రత్త వహిస్తూ పాలనను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం కనపడుతోంది. ఈ ఆరు నెలల్లో రిలాక్స్ అయ్యారో… బాబు పని అంతే… అని చెప్పకతప్పదు.



