కేంద్రంతో నిత్యం చర్చలు జరుపుతూ… రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్ లపై దృష్టి కేంద్రీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ‘సూపర్ యాక్టివ్ సిఎం’గా అభివర్ణించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. దక్షిణాది రాష్ట్రాల్లో చంద్రబాబు మినహా ఏ సీఎం తనతో సమావేశమయ్యేందుకు పెద్దగా ఆసక్తి కనపర్చరని ఈ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు, ఇండియాలో ‘సూపర్ యాక్టివ్ సీఎం’ చంద్రబాబు అని ప్రశంసించారు.
కేంద్రం నుంచి ఏపీకి ప్రయోజనాలు పొందే లక్ష్యంతో సీఎం చంద్రబాబు తమతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంటారని, ప్రభుత్వం నూతన విధానాలు ప్రకటించిన మర్నాడే ఏపీ సీఎం చంద్రబాబు, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే తమతో చర్చించారని చెప్పారు. విద్యుత్ రంగంలో ఏపీ శరవేగంగా దూసుకుపోతోందని, ఏడాదిలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు. ఏపీ విద్యుత్ విధానం దేశమంతటికి ఆదర్శమని కొనియాడారు.



