Chandrababu Naidu Amaravati Andhra Pradesh Development

రాష్ట్ర విభజనకు ముందు మూడు పువ్వులు, ఆరు కాయలు తరహా అభివృద్ధి బాటలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఒక్కసారిగా కుదేలయింది. అభివృద్ధికి నోచుకోని ఏడారి మాదిరి, రాజధాని లేని అనాధ లెక్క సాయం కోసం కేంద్రం వైపు ధీనంగా ఎదురుచూసే పరిస్థితులను చవి చూసింది ఆంధ్రప్రదేశ్.

అయితే కటిక చీకటిలో చిరు దివ్వెలా అంధకారంలో ఉన్న ఏపీకి ముఖ్యమంత్రిగా 2014 లో చంద్రబాబు ఎంపికవ్వడంతో ఏపీ ప్రజలకు కొత్త ఆశలు చిగురించాయి. తమ రాష్ట్రం కూడా పొరుగు రాష్ట్రాల మాదిరి అభివృద్ధి పథంలో, ఉపాధి అవకాశాలతో దూసుకుపోతుంది అనే గట్టి నమ్మకం కలిగింది.

Also Read – కేసీఆర్‌, జగన్‌, రేవంత్ చారిత్రిక తప్పిదాలు… మూల్యం పెద్దదే!

అయితే వారి నమ్మకాలకు తగ్గట్టే బాబు కూడా తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని ఏపీ అభివృద్ధికి ఖర్చు చేయాలనే ధృడ సంకల్పంతో రాజధానిగా అమరావతి నిర్మాణానికి నాంది పలికారు. టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల సమయంలో ఏపీ రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని నిర్మాణాల పూర్తికి తానూ ఎంత చేయగలరో అంతా శక్తి వంచన లేకుండా చేసారు బాబు.

ఏపీ అభివృద్ధికి వైసీపీ రూపంలో ఆటంకాలు వచ్చినా, రాజధాని నిర్మాణానికి జగన్ రూపంలో అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేసేదెలా అన్నట్టుగా ఏపీ పురోగమనానికి తనవంతు కృషి చేసారు. కేంద్ర పెద్దల సహకారం లేకున్నా, ఆర్థిక ఇబ్బందులు ఎదురయినా, ప్రతిపక్ష వైసీపీ నుండి ఎదురు దెబ్బలు తింటున్నా సన్ రైజ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచానికి పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యారు.

Also Read – సీక్వెల్స్: వైఫల్యం నుండి విజయం వరకు

దీనితో సింగపూర్ పూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు అమరావతి నిర్మాణానికి ముందుకొచ్చాయి. అలాగే కియా, శ్రీ సిటీ వంటి పారిశ్రామికీకరణకు బాటలు పడ్డాయి. టీడీపీ ప్రభుత్వ విధానాలతో ఇక ఏపీ పెట్టుబడులతో పారిశ్రామికంగా, రాజధాని నిర్మాణాలతో ఆర్థికంగా, నదుల అనుసంధానం తో అటు వ్యవసాయ రంగంలోనూ ముందంజలో ఉండడంతో ఏపీ “కాపు మీదున్న చెట్టు” మాదిరి అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే 2019 ఎన్నికలు బాబు ఆశయాలనే కాదు ఏపీ భవిష్యత్ ను తలక్రిందులు చేసాయి. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడంతో మొదలైన ఏపీ పతనం ఐదేళ్ల పాటు తన దిశను మార్చుకోకుండా తిరోగమనాన్నే ఎంచుకుంది. మూడు రాజధానులు అంటూ జగన్ మొదలుపెట్టిన మూడు ముక్కలాట ఏపీ దశ దిశను తలక్రిందులు చేసాయి.

Also Read – నాగబాబుతో వైసీపీకి బాగానే చెక్ పెట్టారు కానీ..

వైసీపీ ప్రభుత్వ విధానాలు, జగన్ నిర్ణయాలు పెట్టుబడిదారులను ఏపీ వైపు చూడకుండా చేసాయి. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా జగన్ వైఖరితో విసిగిపోయి పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. వైసీపీ కక్ష్య పూరిత రాజకీయాలు, జగన్ ఒంటెద్దు పోకడలు, వైసీపీ నేతల దిగజారుడు భాష ఏపీ పరువును సమాధి చేసాయి.

దీనితో వివాదాలకు పుట్టినిల్లుగా, అరాచకాలకు మెట్టినిల్లుగా నవ్యాంధ్రప్రదేశ్ అడ్రెస్స్ ను మార్చారు జగన్. నవ నగరాలుగా అభివృద్ధి చెందాల్సిన ఏపీ నవరత్నాల పేరుతో నాశనమయ్యింది. ఈ నేపథ్యంలో “కాపు మీద ఉన్న చెట్టు కట్టెలపాలయే” అన్నట్టుగా ఏపీ పరిస్థితి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని విధంగా, గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మత్తులు చేయించలేని దారుణంగా మారిపోయింది.

2019 ఎన్నికలకు ముందు వరకు మరో ఐదేళ్లలో ఏపీ రూపురేఖలు రాజధాని నిర్మాణాలతో, పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రోజెక్టుల పూర్తి తో, పారిశ్రామికంగా, ఆర్థికంగా, ఉపాదవకాశాల పరంగా పొరుగు రాష్ట్రాలకు ధీటుగా ఏపీ మారిపోనుంది అని అభివృద్ధి ఫలాల కోసం కలలు కన్న యువతకు చివరికి ఎండిన కట్టెలే మిగిలాయి.

2014 లో మొదలైన ఈ మహా యజ్ఞానికి 2019 -2024 మధ్య ఒక ఐదేళ్ల పాటు అవరోధాలు ఏర్పడినప్పటికీ 2024 మళ్ళీ ఏపీ పునర్వైభవానికి అవకాశన్ని అందించింది. కనీసం ఈసారైనా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు చిత్తశుద్దిగా రాష్ట్ర అభివృద్ధికి నడుంబిగించి అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయాలి.




అలాగే ప్రజలు కూడా పని చేసే నాయకుడెవరో.? పతనం వైపు నడిపే నేతెవరో.? గ్రహించి ఏపీ పునర్నిర్మాణానికి తమ వంతు బాధ్యతను నెరవేర్చాలి.