చంద్రబాబు విశ్లేషణ.. మామూలుగా లేదు!

Chandrababu Naidu Analysis on Vivekananda Reddy Murder Case

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు శాసనసభలో వివేకాహత్య కేసు ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో, నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం ఎంత అవసరంమో చక్కగా వివరించారు.

“వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడునేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. నాచేతిలో సీఎంవో, ఇంటలిజన్స్, యావత్ పోలీస్ వ్యవస్థ ఉన్నాయి. నా వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలున్నారు. ఇంతమందిని, ఇన్ని బలమైన వ్యవస్థలు చేతిలో పెట్టుకొని, ఎన్నికల హడావుడిలో ఉన్న నేను ఆ రోజు ఉదయం వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని వాట్సప్ మెసేజ్ వస్తే నమ్మేశాను.

ADVERTISEMENT

కానీ సునీతారెడ్డి వచ్చి పోస్టుమారం కోసం పట్టుబట్టడంతో బండారం బయటపడింది. ఒకవేళ ఆనాడు ఆమె పోస్టుమార్టం కోసం పట్టుబట్టకపోయి ఉంటే ఏమయ్యేది? అంత్యక్రియలు జరిగిపోయేవి. అంత ప్రముఖుడిని అంత దారుణంగా హత్య చేసినవారు తప్పించుకునేవారు కదా?

కానీ పోస్టుమార్టం తర్వాత కూడా వైసీపీ నేతలు మాకంటే చాలా వేగంగా పావులు కదిపారు. మద్యాహ్నంకల్లా జగన్‌ తండ్రిని, బాబాయ్‌ని కూడా కోల్పోయిన అభాగ్యుడిగా ప్రోజెక్ట్ చేసుకున్నారు. సాయంత్రానికల్లా నేనే ఆ హత్య చేయించాననే మరో స్టేట్‌మెంట్‌ సృష్టించి ప్రచారం మొదలుపెట్టేశారు. గుండెపోటు కాదు హత్య అని బయటపడిన గంటల వ్యవధిలోనే వారు ఎంత తెలివిగా పావులు కదిపారో చూస్తే నాకే ఆశ్చర్యమేసింది.

హత్య చేసినవారు తప్పించుకోవడమే కాకుండా ఆ హత్యని తమ రాజకీయ ప్రత్యర్ధులకు ఆపాదించి ఏవిదంగా గేమ్ ఆడతారో వివేకా హత్యతో నిరూపించి చూపారు. దాని పర్యవసానాలు ఏవిదంగా ఉన్నాయో అందరం చూశాము.

అక్కడితో వారు ఆగలేదు. ఈ కేసులో ప్రధాన సాక్షులను ఒకరొకరిగా లేపేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు సాక్షులు చనిపోయారంటే ఈ కేసులో నేరస్తులు ఎంత తెలివిగా చాలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారో అర్దం చేసుకోవచ్చు.

ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో, ఓ కేసులో పరిణామాలు ఏవిదంగా మారిపోతాయో అందరికీ అర్ధమయ్యేందుకే.

కనుక మన పోలీస్, ఫోరెన్సిక్, ఇంటలిజన్స్ అధికారులు, సిబ్బంది ఏదైనా సంచలన కేసు వెలుగు చూసినప్పుడు అప్రమత్తంగా ఉండటమే కాదు.. నేరస్థుల కంటే ఒకడుగు ముందే ఉంటూ వారి ఆలోచనలను పసిగట్టగలగాలి.

క్రైమ్ సీన్‌లో ‘ఫోరెన్సిక్’దే కీలకపాత్ర. కనుక ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంటూ, దానిని సమర్ధంగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి.

అలాగే అధికారంలో ఉన్నాము కదా మనం ఏమి చేసినా చెల్లుతుందని వ్యవహరిస్తే తర్వాత పరిస్థితులు మారితే పర్యవసానాలు ఏవిదంగా ఉంటాయో రాజకీయాలలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ కేసు ద్వారా తెలుసుకొని బుద్ధిగా మసులుకోవాలి.

ప్రతీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలున్నారు. కనుక వారు తమ తమ నియోజకవర్గాలలో శాంతిభద్రతల పరిస్థితి ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నాను,” అని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఈ కేసులో సాంకేతిక, రాజకీయ అంశాల గురించి సిఎం చంద్రబాబు నాయుడు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టిన్నట్లు అందరికీ అర్దమయ్యేలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా పోలీస్, ఇంటలిజన్స్, ఫోరెన్సిక్ విభాగాలు, రాజకీయాలలో ఉండేవారికి ఇదో చక్కని కేస్ స్టడీ అని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories