
దావోస్ పర్యటనలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ రెండు రాష్ట్రాల ప్రజలకు చూడడానికి ఆసక్తిని కలిగిస్తే, బిఆర్ఎస్, వైసీపీ రెండు పార్టీల అధినేతలకు, ఆ పార్టీ శ్రేణులకు కడుపు మంటను సృష్టించింది.
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ ఎయిర్ పోర్ట్ లో భేటీ అయ్యారు. అయితే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటుగా ఆయా రాష్ట్రాల ఐటీ మంత్రులు నారా లోకేష్, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి
రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!
గతంలో అధికారంలో ఉన్న వైసీపీ, బిఆర్ఎస్ అధినేతలు జగన్, కేటీఆర్ ఇదే తరహాలో భేటీ అయ్యారు. నాడు ఆ ఇద్దరి నేతల భేటీని, ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ పూర్వకమైన బంధాలను ఏర్పాటు చేస్తున్న నేతలు అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్న వైసీపీ, బిఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు రేవంత్, బాబు భేటీని విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే, జగన్ హయాంలో దావోస్ కు వెళ్లాలంటే కోర్టుల నుండి అనుమతి తప్పనిసరి కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలాంటి ఇబ్బందులు లేకపోవడంతో టీడీపీ వర్గాలు వైసీపీ వర్గాలకు సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.
Also Read – ఢిల్లీ బీజేపి ఊడ్చేస్తే తెలంగాణలో కళ్ళాపి తప్పదేమో?