పోలీసులకు చంద్రబాబు భరోసా… ఏం ప్రయోజనం?

Chandrababu Naiduటిడిపి అధినేత ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’తో నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడి పర్యటనలో చాలా భారీగా పోలీసులను మోహరించారు. అయితే అక్కడే ఓ ఆశ్చర్యకరమైన పరిణామం జరిగింది.

చంద్రబాబు నాయుడు తనకు సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులను, పోలీసులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేనైనా,మీరైనా, రాష్ట్ర డిజిపి అయినా అందరూ కూడా రాజ్యాంగానికి, చట్టానికి లోబడే నడుచుకోవాలి. లేకుంటే మనమూ నేరస్తులవుతాము. మీరందరూ రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తే మీకు భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులూ రావు. కాదని వైసీపీ నేతలకు భయపడి రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తే మీరు కూడా వారి నేరంలో మీరు కూడా భాగస్తులు అవుతారని మరిచిపోవద్దు.

ADVERTISEMENT

మీరు, నేనూ ఎవరం ఇక్కడ శాశ్వితం కాము. కేవలం ఈ రాష్ట్రం, ప్రజలు మాత్రమే శాశ్వితం అని మీరందరూ తెలుసుకోవాలి. కనుక మీ పోలీసులందరికీ చేతులెత్తి మొక్కి మరీ చెపుతున్నాను. మీ కోసం, మీ కుటుంబాల కోసం మీరు రాజ్యాంగం ప్రకారం నడుచుకోమని కోరుతున్నాను. ఆ విదంగా చేస్తే మిమ్మలని ఎవరూ ఏమీ చేయలేరు. ఈ ప్రభుత్వం మీకు అప్పజెప్పిన బాధ్యతలు రాజ్యాంగ బద్దమా కాదా అని మీకు మీరే ఆలోచించుకోండి. రాజ్యాంగ బద్దమైతే ఖచ్చితంగా చేయండి. కాదని తెలిస్తే అటువంటి పనులు చేయమని ఖచ్చితంగా చెప్పేయండి. మీ అందరికీ నేను, టిడిపి అండగా నిలబడతాము,” అని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.

చంద్రబాబు నాయుడు చెప్పింది నూటికి నూరు శాతం వాస్తవమే అని అందరికీ తెలుసు. రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్నవారు చేసే పనులు, తీసుకొనే నిర్ణయాలను అమలుచేసే బాధ్యత ప్రభుత్వాధికారులు, పోలీస్ అధికారులదే. కనుక వాటిలో రాజ్యాంగం, చట్ట వ్యతిరేకంగా ఉంటే వాటికి వారే కోర్టులకు జవాబులు చెప్పుకోవలసి ఉంటుంది. అక్రమస్తుల కేసులలో అనేకమంది ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అలాగే ఏపీలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సచివాలయాలు, ఇతర కార్యాలయాలు నిర్మించినందుకు అధికారులకే హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి తప్ప ఆ నిర్ణయం తీసుకొన్న మంత్రులకి కాదు.

ప్రతిపక్షాలతో పోలీసులు ఏవిదంగా వ్యవహరించాలనేది అధికారంలో ఉన్నవారి ఆదేశాల ప్రకారమే నడుచుకోక తప్పదు. ప్రభుత్వాలు వాటితో పాటు ముఖ్యమంత్రులు, మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు. కనుక పూర్తి భిన్న వైఖరులు కలిగిన ప్రభుత్వాలతో పనిచేయడం వారికి కత్తి మీద సాముచేయడం వంటిదే. చివరికి అధికార పార్టీల నేతలు కూడా వారిని శాశిస్తూనే ఉంటారు.

ఉదాహరణకు ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎస్పీగా నియమితులైన ఓ అధికారిని 24 గంటలలో బదిలీచేసి వేరేవారిని నియమించిన సంగతి తెలిసిందే.

కనుక ఎవరు అధికారంలో ఉంటే వారికి పోలీస్ అధికారులు విధేయంగా పనిచేయక తప్పదు. కాదంటే ఏమవుతుందో అందరికీ తెలుసు. కనుక అది రాజ్యాంగ వ్యతిరేకమని తెలిసినా…పోలీస్ అధికారులు, పోలీసులు వారి ఇష్టాయిష్టాలు, సొంత అభిప్రాయాలను పక్కన పెట్టి పనిచేయాల్సిందే. ఈ విషయం రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. పోలీస్ అధికారులకు కూడా తెలుసు. కనుక వారిని ఈ విధానాలకు భిన్నంగా వ్యవహరించాలని ఆశించి ప్రయోజనం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories