Gudivada-Chandrababu-Naidu-Kodali-Nani

గత కొన్నేళ్లుగా గుడివాడ కేంద్రంగా కొడాలి నాని చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. గుడివాడ ‘నాని’ అడ్డా అంటూ కొంతమంది కిరాయి మూకలను పోగేసి గుడివాడలో వైసీపీ నేతలు తప్ప మరెవరైనా ముఖ్యంగా టీడీపీ నేతలు ఎవరైనా పార్టీ తరుపున ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చిన దానిని హింసాయుతం చేసి గుడివాడను ప్రముఖ వార్తలలో ఉంచేవారు.

Also Read – అభివృద్ధి కంటే వినాశనానికే మద్దతెక్కువా..?

వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన బలుపు నానిని ఏ స్థాయికి తీసుకు వెళ్ళింది అని తెలుసుకోవడానికి గత ఐదేళ్లు ఆయన వాడిన భాషా, ఆయన వ్యవహరించిన తీరే ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. కొడాలి మీడియా ముందుకొస్తే టీవీ ఆఫ్ చేసే పరిస్థితికి ఆయన భాష దిగజారిపోయింది.

ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ పై నాని వాడిన భాషకు, తిట్టిన తిట్లకు వైసీపీ శ్రేయోభిలాషులు సైతం నాని తీరును వ్యతిరేకించారు. అధికారం తో ఎక్కిన మదం, పదవితో వచ్చిన అహంకారం అన్ని ఒక్క ఓటమితో పోయిందా అనేలా ఇప్పుడు నాని గుడివాడలో బొత్తిగా నల్లపూసయిపోయాడు.

Also Read – జాక్ అండ్ లైలా: రెండు స్పీడ్ బ్రేకర్లే

మీడియా ముందుకు కాదుకదా తన ఇంటి సందు ముందుకు కూడా రాలేని దుస్థితిలో కలుగులో దాక్కున్న ఎలక మాదిరి కొడాలి తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. గుడివాడలో నానిని ఢీ కొట్టి గెలవడం అంటే టీడీపీ పరువు నిలపడం, ప్రతిష్టను మరోమెట్టెక్కించడమే అన్నట్లుగా మారిపోయింది ఈ నియోజకర్గం.

పార్టీకి కీలకంగా మారిన ఇటువంటి సీటును గెలిచి టీడీపీ జెండా పొగరును నిలిపిన గుడివాడ ప్రజలకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కు చంద్రబాబు ఇస్తున్న గౌరవం ఏపాటిదో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తేలిపోయింది. ఈ ఆగష్టు 15 న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటిన్లను ప్రతిభించనుంది కూటమి ప్రభుత్వం.

Also Read – విశాఖ మేయర్‌ పీఠం కూటమికే… సంతోషమేనా?

అయితే ఇందులో భాగంగా గుడివాడలో ప్రారంభించబోయే అన్న క్యాంటీన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా గుడివాడ కు వెళ్లనున్న బాబు గుడివాడ ప్రజలకు ఈ రూపంలో తన కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.

రాష్ట్రంలో ఇన్ని ప్రాంతాలు ఉండగా చంద్రబాబు గుడివాడనే ఎంచుకోవడానికి గల కారణం కొడాలి నాని నే కావచ్చు. గత ఐదేళ్ళుగా టీడీపీ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలన్నీకి తన రౌడీ మూకలతో అడ్డుకున్న నాని ఇప్పుడు కూడా దమ్ముంటే బయటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోగలరా? అలా అడ్డుకుంటే నానిని ప్రజలు క్షమిస్తారా?




ఇన్నాళ్లు తనను గెలిపించిన ప్రజలను పక్కన పెట్టి, ప్రజావసరాలను గాలికొదిలి జగన్ పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తూ బూతులతో రాజకీయం చేసి గుడివాడ ప్రజలను భయపెట్టిన కొడాలి నానికి తన చేతలతో బుద్దొచ్చినట్టు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికైనా నాని సంస్కారానికి…కుసంస్కారానికి తేడా గమనిస్తే మంచిది.