సీఐ నాగరాజు అరెస్ట్…ప్రశ్నలకు సమాధానాలు వస్తాయా.?

CI Nagaraju Arrest

సాయికృష్ణ మిస్సింగ్ వివాదం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. అయితే సాయికృష్ణ ను పోలీసులు దారుణంగా హింసించి కొట్టి లాకప్ డెత్ చేసారని, చివరికి ఆయన శవాన్ని కూడా కాల్చి బూడిద చేసారంటూ వైసీపీ ఆరోపిస్తుంది.

ఇక ఈ వివాదంలో ముఖ్యంగా సీఐ నాగరాజు మీద ఆరోపణలు రావడంతో విజయవాడ సీపీ నాగరాజుని విధుల నుంచి సస్పెండ్ చేసారు, అలాగే ఇటు ప్రభుత్వం కూడా ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందం సిట్ ను నియమించింది.

ADVERTISEMENT

దీనితో అసలు పోలీసులకు సాయికృష్ణకు మధ్య ఎం జరిగింది.? సాయికృష్ణ మిస్సింగ్ వెనుక నాగరాజు పాత్ర ఎంత.? ఆయన లాకప్ డెత్ ఆరోపణలలో వాస్తవాలేమిటి.? ఒకవేళ అలా జరిగితే సాయికృష్ణ మృత దేహం ఏమయ్యింది.? వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా సాయికృష్ణ శవాన్ని కాల్చి బూడిద చేసారా.? చేస్తే అందుకు సంబంధించిన ఆధారాలేమిటి.? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి.

నేడు సిట్ అధికారులు నాగరాజును అదుపులోకి తీసుకుని ఆయనను విచారణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ కి తరలించారు. అయితే నాగరాజు అరెస్టు నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఫలకార్డ్ లతో స్థానికులు నినాదాలు చేసారు. సాయికృష్ణ కు మద్దతుగా వైసీపీ మీడియా ముందుకొస్తే నాగరాజుకు మద్దతుగా ఆయన మద్దతుదారులు మీడియా ముందుకొస్తున్నారు.

అయితే ఇక్కడ సాయికృష్ణ మీద రౌడీ షీట్ ఉన్నప్పటికీ పోలీసులు చట్టాన్ని తమ చేతులలోకి తీసుకోవడాన్ని ఎవరు స్వాగతించారు. ఒకేవేళ అదే జరిగితే అందుకు వారు తగిన మూల్యం చెల్లించక తప్పదు అనేది నాగరాజు విషయంలో తేటతెల్లమయింది.

అలాగే ఒక నేరస్తుడి నేరానికి వయసు, కులం అడ్డురాదు, అడ్డురాకూడదు అనే కనీస రాజకీయ విలువలను కూడా వైసీపీ గుర్తించాలి. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చెయ్యాలని ప్రభుత్వం పై పోరాటం చెయ్యడం తప్పు కాదు కానీ ఆ పోరాటాన్ని కుల రాజకీయం గా మార్చి ఆ మరకలను ప్రభుత్వ పెద్దలకు పూసి తద్వారా రాజకీయ లబ్ది పొందాలనుకోవడమే ఇక్కడ వైసీపీ చేస్తున్న నీచ రాజకీయం.

ADVERTISEMENT
Latest Stories