రాజకీయాల్లో చంద్రబాబు ఎంత ముందు చూపుతో ఉంటారో.. అనుకోని సమస్యలు వచ్చినప్పుడు కూడా అంతే అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. సమస్యను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడంతో పాటు.. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో మార్గాలు వెతుకుతుంటారు. ఒక విషయాన్ని అన్ని కోణాల్లో బేరీజు వేసుకుని స్టెప్ తీసుకుంటారు చంద్రబాబు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా.. ఏపీ ప్రజలకు ఏ ప్రాంతంలో సమస్య వచ్చినా చాలా వేగంగా స్పందిస్తుంటారు.
కాగా ఇప్పుడు రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. యుక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. దాంతో చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగిపోయారు. చిక్కుకుపోయిన స్టూడెంట్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. టీడీపీ ఎన్నారై సెల్ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందుకోసం హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేశారు.
దాంతో పాటు యుక్రెయిన్ లో ఉన్న 1481మంది స్టూడెంట్ల వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు పంపారు. స్లోవాకియా, పోలండ్ ల మీదుగా ప్రత్యేక విమానాలు నడిపి వారిని తీసుకురావాలంటూ లేఖ రాశారు. అయితే చంద్రబాబు సమయస్ఫూర్తి మీద కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ఎప్పుడైనా పక్కా ప్లానింగ్ తోనే పనిచేస్తారంటూ వెల్లడించారు.
ఇప్పుడు కూడా యుక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల విషయంలో ఆయన స్పందించిన తీరు అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. అయితే ప్రభుత్వంలో ఉన్న జగన్‌ను కాకుండా.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పనితీరును మెచ్చుకోవడం ఇక్కడ గమనార్హం. అధికారం ఉన్నా లేకపోయినా.. స్పందించే తీరుకే ప్రశంసలు దక్కుతాయని మరోసారి నిరూపితం అయిందంటున్నారు టీడీపీ తమ్ముళ్లు.
చంద్రబాబు ఎప్పుడైనా విజన్ తోనే పనిచేస్తారంటూ మరోసారి వెల్లడయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక అటు నారా లోకేష్ కూడా టీడీపీ ఎన్నారై సెల్ తో సమన్వయం జరుపుతూ.. విద్యార్థులను రప్పించేందుకు కృషి చేస్తున్నారు. తెలుగు విద్యార్థుల పట్ల టీడీపీ స్పందిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంటి.



