చంద్రబాబు ఢిల్లీ ప్రెస్ మీట్ ను బ్లాక్ అవుట్ చేయించిన అమిత్ షా

Chandrababu - Naidu - Delhi Press Meetదిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకముందూ ఏపీ ప్రజలకు న్యాయం చేయడంలో సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. మెజారిటీకి, నైతికతకు మధ్య జరుగుతోన్న పోరాటమిదని పేర్కొన్నారు.

విభజన సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి.. ఒక్కటీ నెరవేర్చలేదు. కేంద్ర పెద్దలందరినీ కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశామని.. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు శతవిధాలు ప్రయత్నించామని చెప్పారు. “నేనెప్పుడూ యూటర్న్‌ తీసుకోలేదు. మీరు తప్పు చేశారు కాబట్టే నిలదీశాను’ అని చంద్రబాబు అన్నారు.

ADVERTISEMENT

అయితే చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నట్టు తెలిసి అమిత్ షా చక్రం తిప్పినట్టు సమాచారం. చంద్రబాబు ప్రెస్ మీట్ ను కవర్ చెయ్యకూడదని పలు మీడియా సంస్థలకు హుకుం జారీ చేసినట్టు సమాచారం. దీనితో కేవలం రెండు జాతీయ ఛానళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ను లైవ్ ఇచ్చాయి.

ADVERTISEMENT
Latest Stories