ఒకే ఒక్క ఫిర్యాదుతో ఏపీ ఎన్నికల ప్రభావితం కాబోతున్నాయా?

Chandrababu Naidu election-commission-india-రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికలను ఏపీ, తెలంగాణ సెంటిమెంట్స్ తీవ్రంగా ప్రభావితం చేశాయి. 2019 ఏపీ శాసనసభ ఎన్నికలలో టిడిపి వ్యతిరేక శక్తులన్నీ ఏకమవడం, జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలనే ప్రజల నిర్ణయం ఫలితాలను ప్రభావితం చేసాయి. 2024లో జరుగబోయే ఎన్నికలను సంక్షేమ పధకాలు, అమరావతి రాజధాని, టిడిపి, జనసేన, బిజెపిల పొత్తులు, బిఆర్ఎస్ ఎంట్రీ తీవ్ర ప్రభావితం చేయనున్నాయి.

తాజాగా వీటికి మరో అంశం కూడా తోడవబోతోంది. అదే… ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం, వాలంటీర్ల వ్యవస్థపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమీషన్‌ (సీఈసీ)కి ఫిర్యాదు చేయడం.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో సీఈసీని కలిసి కొన్ని పిర్యాదులు చేశారు.

1.ఫారం-7 ద్వారా ఏపీలో 15 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు.

2.ఏపీలో టిడిపికి ఓట్లు వేసే ఓటర్లను వాలంటీర్ల ద్వారా గుర్తించి వారి ఓట్లను జాబితాలలో నుంచి తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది దొంగ ఓటర్లను కొత్తగా చేర్చారు. చనిపోయిన ఓటర్ల పేర్లను కూడా ఆ జాబితాలలో చేర్చారు. ఒకే డోర్ నంబరులో వందల కొద్దీ ఓటర్లను చేర్చుతోంది.

3.వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచాలని చెప్పినా వైసీపీ ప్రభుత్వం వారి ద్వారానే ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తోంది. వాటిని ప్రైవేట్ ఏజన్సీలకు అప్పగిస్తోంది.

4.ఓటర్ల జాబితా పరిశీలన, మార్పులు చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్వర్యంలో జరుగవలసి ఉండగా వాలంటీర్ల చేత చేయిస్తున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు.

5.ఓటర్ల జాబితాలలో అవకతవకల గురించి సాక్ష్యాధారాలతో సహా మా పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు. దానిని వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ పనిచేయనీయడం లేదు.

6.దేశమంతా అంగన్వాడీ, ఉపాధ్యాయుల ద్వారానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంటే ఏపీలో మాత్రం వాలంటీర్ల ద్వారా చేయిస్తోంది.

7.ఏపీలో ఈ ఓటర్ల జాబితాలలో అవకతవకలను పరిశీలించేందుకు ఓ ఎన్నికల నిపుణుడు అధ్వర్యంలో ఓ హైపవర్ కమిటీని వేయాలి. దానిలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎన్నికల అధికారులు, ఐఏఎస్ అధికారులను సభ్యులుగా వేయాలి. ఆ కమిటీ ఏపీలో ఈ ఓటర్ల జాబితాలన్నిటినీ పూర్తిగా పరిశీలించిన పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే అది ఎలక్షన్ కాబోదు వైసీపీ సెలక్షన్ అవుతుంది.

చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో సహా చేసిన ఈ పిర్యాదులు, హైపవర్ కమిటీ వేయాలనే సూచనలపై సీఈసీ సీరియస్‌గా తీసుకొని విచారణ మొదలుపెడితే ముందుగా వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టేయడం ఖాయం. ఆ తర్వాత ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేస్తే వైసీపీ చేర్చిన దొంగ ఓట్లన్నీ రద్దు అయిపోవచ్చు. ఒకవేళ ఈ రెండూ జరిగితే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి తప్పదు.

కానీ సీఈసీ చంద్రబాబు నాయుడు పిర్యాదులపై స్పందించి హైపవర్ కమిటీ వేస్తుందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం టిడిపి, వైసీపీలలో ఎటువైపు మొగ్గుతుందనే దానిపైనే ఆధారపడి ఉంటుందనేది బహిరంగ రహస్యం.

ADVERTISEMENT
Latest Stories