అమెరికాలో చంద్రబాబుకు పురస్కారం!

chandrababu naidu felicitated in americaఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తన తండ్రి అయిన నారా చంద్రబాబు నాయుడిపై మంత్రి లోకేష్ ప్రశంసలు వర్షం కురిపించారు. అరవై ఏడేళ్ల వయసులో కూడా చంద్రబాబు ఇరవై ఏళ్ల యువకుడిలా ‘ఆల్ రౌండర్’గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రివర్యులకు కితాబిచ్చారు. కృష్ణాజిల్లా గన్నవరంలో ఎల్ఈడీ విద్యుత్ దీపాలను రిమోట్ ద్వారా ప్రారంభించిన అనంతరం లోకేష్ ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల్లో 5 లక్షల ఎల్ఈడీ దీపాలు అమర్చేందుకు కార్యాచరణ ప్రారంభమైందని అన్నారు.

ADVERTISEMENT

టీడీపీ వేసిన రోడ్లు, స్ట్రీట్ వెలుగుల్లో ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం చేసుకునేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. గ్రామాల పరిశుభ్రత కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్లు పెడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ-మెయిల్స్ తో దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ చేయని నీచమైన పనిని వైసీపీ చేస్తోందని, కేంద్రంలో నుంచి బయటకు రావాలంటే ఒక్క నిమిషం పట్టదని, అలా చేస్తే రాష్ట్రాభివృద్ధి జరగదని, గ్రామాల అభివృద్ధికి కేంద్ర సర్కార్ సాయం కావాలని అందరూ గుర్తించాలని లోకేష్ పేర్కొన్నారు.

ఇలా తండ్రిపై నారా లోకేష్ ప్రశంసలు కురిపిస్తున్న సమయంలోనే… మరో వైపు అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన పురస్కారం అందుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) రెండో వార్షిక పశ్చిమ తీర సదస్సులో ‘ట్రాన్స్ ఫర్మేటివ్ చీఫ్ అడ్మినిస్టర్’ పురస్కారాన్ని చంద్రబాబు స్వీకరించారు. అనంతరం వరుస ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించగా, ఏపీని క్లౌడ్ హబ్ గా రూపొందించడంలో సహకరిస్తామని నుటనిక్స్ సంస్థ ముందుకొచ్చింది. ఆ తర్వాత ‘సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పర్మేషనల్ జర్నీ టూ వార్డ్స్ ఏ హ్యాపీ స్టేట్’ అనే ద్వైపాక్షిక సదస్సులో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు.

ADVERTISEMENT
Latest Stories