అవిశ్వాస తీర్మాణం చర్చ సంధర్భంగా అలక పానుపు ఎక్కిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈరోజు దాదాపు 20నిమిషాల పాటు భేటీ అయ్యారు. సీఎంతో ఏకాంతంగా చర్చించిన జేసీ వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పెండింగు సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరినట్టు సమాచారం
రాజీనామా వంటి ప్రకటనలపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు జేసీకి కాస్త గట్టిగానే హితబోధ చేసినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం సచివాలయానికి వచ్చిన ఆయన సీఎం కార్యాలయంలో వివిధ పెండింగ్ దస్త్రాలకు సంబంధించి ఉన్నతాధికారులను కలిశారు.
అక్కడ కనిపించిన మీడియా పార్లమెంట్ కు వెళ్ళకపోవడంపై అడిగితే ఆయన స్పందిస్తూ.. అంతా సమసిపోయిందని, తాను పార్లమెంట్‌కు హాజరవుతున్నానని తెలిపారు. మోదీ ప్రధానిగా ఉన్నంతవరకూ విభజన హామీలు అమలుకావని.. అప్పటివరకూ తమ పోరాటం కొనసాగించాల్సిందేనని చెప్పారు.



