రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం శనివారం సాయంత్రం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు తదితరులున్నారు.
Also Read – జగన్ ను నమ్మితే ‘భవిష్యత్’ గోవిందా..!
చంద్రబాబు నాయుడు దంపతులను ముఖేష్ అంబానీ దంపతులు సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వారాహి దీక్షలో ఉన్న కారణంగా దీక్షా వస్త్రాన్ని పైన కప్పుకొని ఈ వేడుకకు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురూ అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌లను ఆశీర్వదించి వారితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పారు.
అయితే ఈ పెళ్ళి వేడుకలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి తదితరులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనపడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
Also Read – బాలినేని ఈ సారి ‘రాజీ’ పడలేదు..!
కేసీఆర్, జగన్ ఇద్దరూ ఇప్పుడు అధికారంలో లేరు కనుక వారిని ఆహ్వానించి ఉండకపోవచ్చని సరిపెట్టుకోవచ్చు. కానీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ని ఆహ్వానించిన అంబానీలు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించలేదనుకోలేము. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ వేడుకలో పాల్గొనలేదు? అనే సందేహం కలుగుతుంది.
ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియాలో ఆదివారం ఉదయం జరిగే కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొని విజయవాడ తిరుగు ప్రయాణం అయ్యారు.
Also Read – ఐదేళ్ళ వైఫల్యం 100 రోజుల సమర్ధతని ప్రశ్నిస్తోంది!