chandrababu_pawan-kalyan

కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. అయితే ఈసారి ఏపీలో ప్రభుత్వ మార్పు ఓ సంచలనమే అని చెప్పాలి.

Also Read – ఫర్నిచర్ దొంగ…ఈ మాట విన్నట్టుందా.? అన్నట్టుందా.?

గత 5 ఏళ్ళలో జగన్‌ పాలనను, ఆలోచనలను, విధానాలను, నిర్ణయాలను అన్నిటినీ రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో తిరస్కరించి టిడిపి, జనసేన, బీజేపీ కూటమికి 175కి 164 సీట్లతో అధికారం అప్పగించారు.

రేపు (బుధవారం) ఉదయం 11.27 గంటలకు గన్నవరం వద్ద కేసరపల్లి వద్ద చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా అప్పుడే గన్నవరంలో పండగ వాతావరణం నెలకొంది.

Also Read – ఉండవల్లిలో జగన్‌ మ్యూజియం… భేష్ మంచి ప్రతిపాదనే!

మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నందుకు టిడిపి నేతలు, కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారు.

పవర్ స్టార్‌గా తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పవన్‌ కళ్యాణ్‌, తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి రేపు మంత్రి లేదా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తుండటంతో మరోపక్క పవన్‌ కళ్యాణ్‌ వీరాభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తల కోలాహలం అంతా ఇంతా కాదు.

Also Read – రోజా… అదే చిడతల భజన..!

పదేళ్ళ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కాబోతుండటంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

రేపటి కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు. ఆయనతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం తరలివస్తుండటంతో మెగా అభిమానులు వారికి స్వాగతం చెప్పేందుకు చాలా హడావుడి చేస్తున్నారు.

ఇంతకాలం జగన్‌ ప్రభుత్వం సినీ పరిశ్రమని వేధించింది. ఇప్పుడు జగన్‌ నుంచి విముక్తి లభించడమే కాకుండా ప్రభుత్వంలో పవన్‌ కళ్యాణ్‌ ఉండటం, సినీ పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. కనుక పలువురు సినీ ప్రముఖులు కూడా చాలా సంతోషంగా ఇది తమ ఇంట్లో శుభకార్యం అన్నట్లు తరలిరాబోతున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఇంకా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు రేపటి కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. కనుక రాజకీయంగా కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగానే ఉండబోతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి టిడిపి, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు.

అమరావతికి భూములు ఇచ్చిన రైతులను జగన్‌ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళలో ఎంతగానో వేధించింది, అవమానించింది. చంద్రబాబు నాయుడు వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. నేడు విజయవాడలో జరిగిన మూడు పార్టీల శాసనసభా పక్ష సమావేశంలోనే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిగా ఉండబోతోందని, దాని కోసం త్యాగాలు చేసిన రైతులందరికీ తమ ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చి వారికి న్యాయం చేస్తుందని చెప్పడంతో వారు చాలా సంతోషిస్తున్నారు.

అమరావతి రాజధాని కాబోతోందనే సంతోషంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో రైతులు, మహిళలు, రేపటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

వివిద రంగాలకు చెందిన ప్రతీ ఒక్కరిలో, రాష్ట్ర ప్రజలలో ఇది మా అందరికీ సంబందించిన కార్యక్రమం అనే భావన కనిపిస్తోంది. అందుకే రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమం సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగల్లా అందరూ కలిసి జరుపుకోబోతున్నారు.

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ కొత్త అధ్యాయం మొదలవుతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో, ఇరుగుపొరుగు రాష్ట్రాలలో కూడా అనుకూల వాతావరణం నెలకొని ఉన్నందున ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చిన్నట్లే భావించవచ్చు.