బాబు నిర్ణయం వైసీపీ కి చెంపపెట్టు…!

chandrababu-naidu-pension-distribution-at-door-steps

ఎన్నికల ముందు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి వైసీపీ ఆడిన పెన్షన్ల రాజకీయంతో అమాయకులైన వృద్దులు వడ దెబ్బ బారిన పడి ప్రాణాలు విడిచారు. ఈసీ నిర్ణయం మేరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణముగా వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందితో పింషన్ల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టాలి అంటూ బాబు ఇచ్చిన సలహాలను జగన్ పెడచెవిన పెట్టారు.

రాష్ట్రంలో తానూ సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు పాలనే స్తంభించిపోతుంది అన్న జగన్ వాదనను, మొండి వైఖరిని ఈ రోజు బాబు పటాపంచలు చేసి చూపించారు. జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకో లేకపొతే సంక్షేమ పథకాలు ఇంటికి రావడం ఆగిపోతాయని ఫేక్ ప్రచారాలు చేసిన వైసీపీ కి చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వం.

ADVERTISEMENT

నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెనుమాక గ్రామంలో జులై నెలలో 7 వేలు పెన్షన్ అంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెంషన్లను పంపిణి చేసారు. ఒక సామాన్యుడి మాదిరి లబ్ధిదారుని ఇంటికి వెళ్లిన బాబు వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. వారి కుటుంబ సభ్యుల మాదిరే కలిసిపోయి వారు ఆప్యాయంగా ఇచ్చిన టీ తాగి తానూ మీలో ఒకడినే అనే నమ్మకాన్ని కలిగించారు బాబు.

అలాగే జగన్ ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేయడం తమకు చేతకాదు అంటూ చేతులెత్తిసిన తరుణంలో మనసుంటే మార్గం ఉంటుంది అని నిరూపించారు బాబు. గతంలో తానూ చెప్పిన సచివాలయ సిబ్బందిని పెంషన్ల పంపిణీకి వినియోగించుకుని వారి ద్వారానే రాష్ట్రమంతా ఈ కార్యక్రమాన్ని అమలు చేసి చూపించారు.
వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ వ్యవస్థ ను వాడకుండానే సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసి చూపించింది కూటమి ప్రభుత్వం.

తనతో పాటుగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే లు మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాలలో తమ చేతుల మీదుగా పెంషన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొనాలి అంటూ బాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. నిమ్మల రామానాయుడు కూడా తన నియోజకవర్గంలో తానే స్వయంగా ఈ పింషన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ADVERTISEMENT
Latest Stories