ఏపీ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు?

Chandrababu Naidu plans to cabinet expantionఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ వచ్చే నెలలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెదవి విప్పకపోయినా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ముగియడంతో ఏప్రిల్ మొదటి, లేదంటే రెండో వారంలో విస్తరణ ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి సన్నిహితులు చెబుతున్నారు.

ADVERTISEMENT

ఇటీవలే ఎమ్మెల్సీ అయిన లోకేశ్‌ ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఏప్రిల్‌ లో టీడీపీ జిల్లా కమిటీల ఎన్నికలు, మే నెలలో మహానాడు సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్రస్థాయి మహానాడు సమావేశాలు జరగనున్నాయి. దీంతో మహానాడు ముగిసే లోపే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకర కూడా పూర్తిచేయాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏదో ఒక కారణంతో సీఎంను కలుస్తూ ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ప్రస్తుతం శాసనమండలి నుంచి యనమల రామకృష్ణుడు, నారాయణ మంత్రులుగా ఉన్నారు. లోకేశ్‌ ను కూడా మండలి నుంచే మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరికి మించి శాసనమండలి నుంచి తీసుకోబోరనే ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రివర్గంలో శాసనసభ నుంచే ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories