గత 5 ఏళ్ళలో రాష్ట్రంలో సంక్షేమ పధకాల గోల తప్పిస్తే ఏనాడూ పోలవరం ప్రాజెక్టు గురించి కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. మొదట్లో ‘రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ఖర్చులో భారీగా మిగులు’ అంటూ జగన్ ఒకే ఒకసారి మాట్లాడిన్నట్లు ప్రజలకు గుర్తు ఉండే ఉంటుంది.
ఆ తర్వాత పోలవరం గురించి ఎక్కువగా మాట్లాడిన క్రెడిట్ మాజీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబుకే దక్కుతుంది. ఆయన ఈ 5 ఏళ్ళలో పోలవరం గురించి ఏమి మాట్లారంటే…
1. వరదలకు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది.
2. దానికి చంద్రబాబు నాయుడే కారణం.
3. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము.
4. పోలవరం ప్రాజెక్టు గురించి నాకే అర్ధం కాలేదు. కనుక మరెవరికీ అర్ధం కాదు.
జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన చెప్పిన నాలుగు ముక్కలు ఇవే. మరో ముక్క ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. అధికారంలో ఉన్నంత కాలం పోలవరం గురించి మాట్లాడకుండా అంబటి రాంబాబు చాలా సంయమనం పాటించారు. కానీ పోలవరం ప్రాజెక్టు గురించి వైసీపిలో అందరి కంటే ఎక్కువ మాట్లాడిన క్రెడిట్ ఖచ్చితంగా అంబటి రాంబాబుకే దక్కుతుంది.
జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు ఇద్దరూ 5 ఏళ్ళలో పోలవరం గురించి మాట్లాడేందుకు సాహసించలేదు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పోలవరం పర్యటించి పనుల పురోగతిని సమీక్షించి వచ్చారు.
నేడు చంద్రబాబు నాయుడు స్వయంగా సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా 2014-2019 మద్య జరిగిన పనులు, 2019-2024 మద్య జరిగిన పనులు, వాటి కోసం తన ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చులు, పనుల పురోగతి గురించి వివరించి శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ వివరాలు క్లుప్తంగా గణాంకాలలో…




