చుక్కలు చుపిస్తామంటే భయపడే వాళ్ళెవరూ లేరు … చంద్రబాబు

Chandrababu Naidu raises his voice on Central Governmentఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై స్వరం పెంచినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా సమన్వయంతో వ్యవహరించిన ఆయన బీజేపీ నాయకుల బ్లాక్ మెయిల్ తో వారికి అర్ధమయ్యే బాషలోనే మాట్లాడటం మొదలుపెట్టారు. తెలుగుజాతి తిరుగుబాటు చేస్తే కేంద్రం గజగజలాడవలసిందేనని హెచ్చరించారు.

ADVERTISEMENT

“కర్ణాటక ఎన్నికల తర్వాత మనకు చుక్కలు చూపిస్తామని కొంతమంది బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారు. వారు ఏ చుక్కలూ చూపించలేరు. ఎవరినీ భయపెట్టలేరు. తెలుగు జాతి తిరుగుబాటు చేస్తే కేంద్రం కూడా గజగజలాడాల్సిందే. కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని ఆయన అన్నారు.

రాష్ట్ర రాజకీయాలను ప్రజలు అర్దం చేసుకోవాలని ఆయన అన్నారు. కేంద్రం పంచన చేరి వారు చేసిన అన్యాయానికి తనని నిందిస్తున్న వారిని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. మరో వైపు 15 తరువాత ఏమవుతుందని అందరు ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇవి కేవలం తాటాకు చప్పుల్లా లేక చంద్రబాబుని ఏమైనా ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories