రాష్ట్రం తరుపున గౌరవం…రాష్ట్రం పట్ల బాధ్యత..!

Chandrababu Naidu Ramoji Rao Commemoration Meeting

ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వం తరుపున ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు సంస్మరణ సభ నిరవహించింది. అయితే అందులో పాల్గొన్న కొందరు ప్రముఖులు రామోజీ తో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.

కురుక్షేత్ర యుద్ధంలో తన ప్రాణాలను అంపశయ్య మీద పడుకోపెట్టుకుని కూడా ధర్మం గెలుపు చూసి మాత్రమే నా ప్రాణాలను విడుస్తాను అంటూ పట్టుపట్టిన మహా బలశాలి, బుద్ధిశాలి అయినా భీష్ముడితో రామోజీరావు ను పోల్చారు సంగీత దర్శకుడు కీరవాణి.

ADVERTISEMENT

తనకెంతో ఇష్టమైన ఆంధ్ర ప్రదేశ్ కబంద హస్తాల నుండి బయటపడడం చూసిన తరువాతనే ఆయన ప్రాణాలు విడిచారంటూ బీష్ముడితో పోల్చారు కీరవాణి. ఎలా ఐతే భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు తన మృత్యువును ఆపుకున్నారో అలాగే రామోజీరావు కూడా ఏపీకి మంచి రోజులు వచ్చే వరకు తన ప్రాణాలను నిలబెట్టుకున్నారన్నారు.

సినీ పరిశ్రమ నుంచి గత వైసీపీ ప్రభుత్వం పై ఈ స్థాయి విమర్శ చేసిన వారిలో కీరవాణినే మొదటి వ్యక్తిగా నిలిచారు. అంటే జగన్ ప్రభుత్వం పై సినీ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో కీరవాణి మాటలతో సుస్పష్టమయ్యింది. ఒకప్పుడు రామోజీ రావు గారి లాగా ఒక్కరోజైనా బతకాలని ఆశపడే వాడిని కానీ ఇప్పుడు రామోజీరావు మాదిరి చనిపోవాలని కోరుకుంటున్న అంటూ రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కీరవాణి.

అలాగే తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేసారు. భారతరత్నతో రామోజీరావు ను గౌరవించడం సముచితం, సబబు అంటూ తన సందేశాన్ని పూర్తి చేసారు జక్కన్న.

అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సమయానికి ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో కూటమి విజయ వార్త అసలు ఆయన విన్నారా అనే సందేహం కలిగిందన్నారు. ఆయన చివరి క్షణాలలో కూడా ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నారు.

ఆయన పోరాటానికి న్యాయం జరిగింది అనే వార్త విన్నారా లేదా అనే ఆలోచనలో ఉన్న నాకు కూటమి విజయ వార్తను ఆయన పూర్తిగా ఆస్వాదించారని తెలిసి ఆనందపడ్డ అంటూ రామోజీరావు కు తన సంతాపాన్ని తెలియచేసారు పవన్. గత ప్రభుత్వంలో వేధింపులు ఎదుర్కున్న రామోజీ ఈ ప్రభుత్వం తాలూకా గౌరవాన్ని అందుకోవడంలో పూర్తి అర్హత కలిగిన వ్యక్తి.

అలాగే బాబు కూడా రామోజీరావు సేవలను ఆయనతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని స్మరించుకుంటూ తెలుగు రాష్ట్రాలకు ఆయన చేసిన సేవలకు గాను విశాఖలో రామోజీ పేరిట చిత్ర నగరి, ఎన్టీఆర్ ఘాట్ మాదిరి మెమోరియల్ నిర్మిస్తామన్నారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి పేరును ఆయనే సూచించారని, అందుకు గాను ఆయన పేరు మీద విజ్ఞాన్ భవన్ నిర్మాణం చేపడతామన్నారు బాబు.

అలాగే రాజధానిలో ఓ రోడ్డుకు రామోజీ రావు పేరు పెడతామంటూ ప్రకటించారు. ఎంతో కాలంగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని, ఈసారి ఎన్టీఆర్ పేరుతో పాటుగా రామోజీ పేరును కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారస్ చేస్తామని హామీ ఇచ్చారు. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున రామోజీ సేవలకు తగ్గ గౌరవం అందించినట్లయ్యింది.

అలాగే రామోజీ రావు కుమారుడు ఈనాడు సంస్థ ఎండీ కిరణ్ కూడా రామోజీరావు కుటుంబం తరుపున ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కొరకు తమవంతు బాధ్యతగా 10 కోట్ల రూపాయిలు విరాళంగా అందించారు. కూటమి ప్రభుత్వం తాలూకా గౌరవాన్ని బాబు, పవన్, రామోజీ కుటుంబానికి అందిస్తే రాష్ట్రం పట్ల బాధ్యతను రామోజీ కుటుంబం తిరిగి నిలబెట్టుకుంది.

ADVERTISEMENT
Latest Stories