ఓ యుద్ధం తర్వాత ఓ నగరాన్ని, దేశాన్ని పునర్నిమించుకోవడం ఎంత కష్టమో అణుబాంబు దాడికి గురైన జపాన్ దేశస్థులకు తెలుసు. అదేవిదంగా జగన్‌ విధ్వంసపాలనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాన్ని తాను మళ్ళీ పునర్నిమించుకుంటున్నానని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌‌ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి తనకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను, వేదికలని ఉపయోగించుకుంటున్నానని చెప్పారు.

Also Read – విశ్వసనీయత అంటే సంక్షేమ పధకాలు అమలుచేయడమేనా?

దావోస్‌ సదస్సులో బిల్ గేట్స్‌ని కలిసినప్పుడు “అప్పుడు హైదరాబాద్‌ని ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఏపీని ప్రమోట్ చేస్తున్నారా?” అని అడిగితే అవునని చెప్పానన్నారు సిఎం చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు నాయుడుకి ఇటువంటి టాస్కులు చేపట్టడం, పూర్తిచేయడం అలవాటు కావచ్చు. కానీ వాటి సత్ఫలితాలను అనుభవించే యోగం ఆయన జాతకంలో లేదని, ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆయన కోసం ఇలాంటి సవాళ్ళు సిద్దంగా ఉంటాయని నారా లోకేష్‌ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తుంది.

Also Read – చంద్రబాబు నాయుడు విధానాలే కరెక్ట్?

రాష్ట్ర విభజన వలన జరిగిన నష్టానికి లెక్కలున్నాయి. కొన్ని సమస్యలు, నష్టాలు కంటికి కనబడుతుంటాయి కూడా.

కానీ ఐదేళ్ళ జగన్‌ అరాచక అవినీతి పాలనలో జరిగిన నష్టాన్ని లెక్క కట్టడం ‘కాగ్’ వల్ల కూడా కాకపోవచ్చు. కాకినాడ పోర్టు భాగోతం ఇందుకు ఓ చిన్న నిదర్శనంగా కనిపిస్తోంది.

Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?

ప్రజలు జగన్‌ని గద్దె దించిన్నప్పటికీ, ఇంకా పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.

ఇటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌‌ ‘బ్రాండ్ ఇమేజ్’ని పెంచడం ఎంత కష్టమో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడికంటే మరెవరికి తెలుసు?

కనుక ఆయన ప్రయత్నాలు ఫలించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌‌ రాష్టరానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు తరలివస్తే అందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను వారిని ఎన్నుకున్న 60 శాతం ప్రజలను అభినందించాల్సిందే.

అయితే దేశ ప్రజలందరి సమిష్టి కృషితోనే జపాన్ దేశం నేడు ఈ స్థాయికి చేరింది తప్ప పాలకుల ఒక్కరి కృషి వల్లనే కాదు. కనుక ఈసారి ఆంధ్రప్రదేశ్‌‌ని, రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, ఐటి కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మిగిలిన 40 శాతం ప్రజలపై కూడా ఉంటుంది.

కాదని ప్రతీ 5 ఏళ్ళకు ఇలా రాజకీయ ప్రయోగాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌‌ ఎప్పుడు బాగుపడుతుంది?అని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి.