అనుకున్నదే అయ్యింది. టీడీపీ కేంద్రం నుండి బయటకు వచ్చేసింది. వచ్చేసింది అనేకంటే వెళ్లేలా పరిస్థితులు ప్రేరేపించాయి అనే అనాలి. నిన్న చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేస్తారు అని అందరు అనుకున్నా, ఆయన కేవలం కేంద్రానికి విజ్ఞప్తులతోనే సరిపెట్టారు. అయితే ఒక గంటలోపే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టి ఏపీకి ఇంకేమి ఇవ్వలేము అని తేల్చి చెప్పారు.
సెంటిమెంట్ బట్టి నిధులు ఎంత ఇవ్వాలని అనేది నిర్ణయించలేమని, ఏపీకి అన్నీ ఇచ్చేస్తే దేశ రక్షణ ఎలా అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఇంక చేసేది లేక ముఖ్యమంత్రి కేంద్రంలోని తమ ఇద్దరు మంత్రులను ఉపసంహరించారు. ఆ నిర్ణయాన్ని స్వయంగా ప్రధానికి తెలపాలని ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఒక ముఖ్యమంత్రికి ప్రధాని అందుబాటులోకి రాలేదు అంటే అది కచ్చితంగా ఆయనను ఎన్నుకున్న ప్రజలను అవమానించడమే కదా. అంతకుముందు దాదాపుగా చంద్రబాబుకు రెండేళ్ళ పాటు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే ఆంధ్రులు అంటే ఎంత లోకువ అనేది అర్ధం అవుతుంది. ఈ సంధర్భంగా చంద్రబాబు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.
వెనుకబడిన జిల్లాలకు ఖర్చుపెట్టిన డబ్బులకు సంబంధించిన బిల్లులు తీసుకొని 350 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎకౌంటులో డిపాజిట్ చేసి ఆ తరువాత ప్రధాని డబ్బులు ఇవ్వొద్దొన్నారని మళ్ళా డబ్బులు వెనక్కి తీసుకున్నారట. ఎంత దారుణం అది? రాయకీయ కక్ష సాధింపు గాక ఇంకేంటి? ఇంత చేసి నిసిగ్గుగా మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం అని ఎలా చెప్పుకుంటున్నారో?



