
గత ఏడాది సంక్రాంతి పండుగ నాటికి తెలంగాణలో ప్రభుత్వం మారడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏదో జరుగబోతోందనే భావన సర్వత్రా నెలకొని ఉండేది.
ఏపీలో రాజకీయ సమీకరణాలలో మార్పుల ప్రభావంతో వైసీపీ నష్టపోబోతోందని జగన్ ఆందోళన చెందుతూ మాట్లాడేవారు. జగన్ భయపడిన్నట్లే రాష్ట్ర ప్రజలు నిశబ్ధంగా తమ తీర్పు ఇచ్చేశారు. ఏపీలో కూడా ప్రభుత్వం మారింది.
Also Read – రాజకీయాలలో కొత్త ట్రెండ్.. ఇది అందరికీ ప్రమాదమే!
అప్పటి నుంచే ఏపీలో మళ్ళీ అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు వంటి మాటలు వినిపిస్తున్నాయి. అమరావతి, పోలవరం పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మార్పులు కనిపిస్తున్నాయి.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మొన్న హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, “మనం ఆంధ్రాతో పోటీ పడటం కాదు.. రెండు రాష్ట్రాలు కలిసి ప్రపంచంతో పోటీ పడాలి,” అని అనడం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణతో పోటీ పడే స్థాయికి ఎదగడమే కాక దాని కంటే వేగంగా ముందుకు దూసుకుపోతోందని అంగీకరించారని అర్దమవుతోంది.
Also Read – చిలుకూరు పరామర్శ పోటీలు… అందుకేనా?
సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచి పెడుతూ అదే ‘మేలు’ అని జగన్ గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఆ మేలే రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రజలకు అందరికీ భారంగా మారింది.
కానీ ప్రజలకు ఏవిదంగా మేలు చేయాలో సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపుతున్నారు. కనుక ఆ ‘మేలు’కి ఈ ‘మేలు’కి ఎంత తేడా ఉందో ప్రజలు గ్రహించారు.
Also Read – కిరణ్..కళ్యాణ్ మాదిరి స్వరం మారుస్తారా.?
సిఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు మరింత మేలు జరుగబోతోందని చాలా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండటం చాలా శుభసూచకం. ఆ నమ్మకంతోనే ప్రజలు ఈ ఏడాది సంక్రాంతి పండుగని మరింత నిశ్చింతగా, మరింత సంతోషంగా జరుపుకుంటున్నారు.
ఐదేళ్ళ జగన్ రాక్షస పాలనలో నరకం అనుభవించిన ప్రజలకు ఈ ఆశ, సతోషం, సంబరాలకు అన్ని విధాలా అర్హులే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.