అయ్యో… బటన్ కూడా పనిచేయడం లేదే… ఎలా ఇప్పుడు?

ys-jagan-button-press-schemes

జగన్‌ బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నాని చెప్పుకోవడంపై చంద్రబాబు నాయుడు రోడ్ షోలో స్పందిస్తూ, “మన బామ్మగారు బటన్ నొక్కలేరా?ప్రతీరోజూ మీరందరూ మీ మొబైల్ ఫోన్లలో బటన్ నొక్కుతూనే ఉన్నారుగా? బటన్ నొక్కడమే ముఖ్యమంత్రి పనా? రాష్ట్రాభివృద్ధి, వ్యవసాయాభివృధ్దికి ఎప్పుడైనా బటన్ నొక్కారా?

ADVERTISEMENT

అయినా బటన్ నొక్కి ఆయన జేబులో డబ్బు ఏమైనా తీసి మీకు ఇస్తున్నారా… లేదు కదా?అప్పులు చేసి తీసుకువచ్చి ప్రజలకు ఇస్తూ, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి ‘మేలు చేస్తున్నానని’ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు.

అయినా మార్చిలో బటన్ నొక్కితే రెండు నెలల తర్వాత ఇప్పుడే ఎందుకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు? పోలింగ్‌కు ముందు ఓటర్ల ఖాతాలలో డబ్బు జమా చేసి ప్రలోభ పెట్టడానికే కదా?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిఎస్ జవహర్ రెడ్డికి శుక్రవారం ఒక లేఖ, శనివారం మరో లేఖ వ్రాసి అక్షింతలు వేసింది.

ఇన్ని రోజులూ డబ్బు జమా చేయకుండా ఇప్పుడు పోలింగ్‌ ముందు రోజే ఎందుకు జమా చేయాలనుకుంటున్నారు?

ఒకరోజు ఆలస్యంగా డబ్బు జమా చేస్తే ఏమైనా ప్రమాదం జరుగుతుందా?

ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మీకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ఇటువంటివి అమలుచేయకూడదని మీకు తెలియదా?

అసలు ఇన్నేళ్ళలో ఏ పధకానికి ఎప్పుడు సిఎం జగన్‌ బటన్ నొక్కారు? నొక్కిన తర్వాత ఎన్ని రోజులు, వారాలు, నెలలకు ఆ డబ్బు లబ్ధిదారుల ఖాతాలలో జమా చేశారు?వగైరా పూర్తి వివరాలను శనివారం మధ్యాహ్నం 3 గంటలలోగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సిఎస్ జవహార్ రెడ్డిని కోరింది. వాటిలో ప్రధానంగా ఈ ఆరు పధకాల గురించి అడిగిన్నట్లు తెలుస్తోంది.

బటన్ నొక్కుళ్ళు: ఆసరా: జనవరి 23, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా: ఫిబ్రవరి 28, జగనన్న విద్యా దీవెన: మార్చి1, రైతులకు ఇన్‌పుట్ సబ్సీడీ: మార్చి 6, వైఎస్సార్ చేయూత: మార్చి 7, వైఎస్సార్ ఈబీసీ నేస్తం: మార్చి 14వ తేదీన జగన్‌ బటన్లు నొక్కారు.

ఇవన్నీ ఎన్నికల కోడ్ రాక ముందే ప్రకటించారు. కనుక ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే లబ్ధి దారుల ఖాతాలలో జమా కావలసి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమలులో వచ్చి పోలింగ్‌ తేదీ దగ్గర పడేవరకు జమా చేయలేదు! వీటన్నిటికీ కలిపి రూ.14,165 కోట్లు అవసరం అవుతాయి. ఇప్పుడు ఒకేసారి అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సిఎస్ జవహార్ రెడ్డిని కోరిన్నట్లు సమాచారం.

ఒకవేళ ప్రభుత్వం వద్ద అంత సొమ్ము లేకపోతే మరి జగన్‌ ఆర్భాటంగా సభలు నిర్వహించి బటన్ ఎందుకు నొక్కారు? ప్రజలను మభ్యపెట్టేందుకేనా?

ఒకవేళ ప్రభుత్వం వద్ద అంత డబ్బు ఉండి ఉంటే, ఇన్ని రోజులు ఆలస్యం చేసి, పోలింగ్‌ తేదీ ముందు విడుదల చేసి ఓటర్లను ప్రలోభ పెట్టాలనే ఆలోచనతోనా?అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories