అమెరికా పర్యటన ముగించుకున్న చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా విజయవాడ రావాల్సి ఉంది. ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ బయల్దేరుతున్నట్టు 3.55కి మీడియాకు అధికారికంగా సమాచారం అందింది. అయితే వెంటనే విజయవాడ బయల్దేరలేదు. రాత్రి తొమ్మిది గంటల వరకు ఎయిర్ పోర్టు లాంజ్ లోనే ఉన్నట్టు మీడియాకు తెలిపారు.
ADVERTISEMENT
అయితే ఎవరికంటా పడకుండా, వెనుక ద్వారం గుండా ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి… ఢిల్లీలోని కొందరు ప్రముఖులతో భేటీ అయినట్టు జగన్ మీడియా ప్రచారం చేసుకుంది. రాత్రి 8.35 వరకు రహస్య మంతనాలు ముగించుకుని… తిరిగి 9 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్టు పేర్కొంది. అయితే చంద్రబాబు ఎవరెవరిని కలిశారన్న విషయం మాత్రం బయటకు రాలేదు. రాత్రి 9.30 గంటలకు ఏపీ సిఎం విజయవాడ బయల్దేరారు.
ADVERTISEMENT



