తాజాగా ప్రకటించిన కాపులకు 5% రిజర్వేషన్ల తో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం రిజర్వేషన్లు 55% కు చేరాయి. దీనితో అగ్రవర్ణాల వారికి నిస్తేజం ఆవహించింది. అయితే వారికి చంద్రబాబు ఒక కొత్త నజరానా ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్‌కి సారథ్యం వహించిన జస్టిస్ కె.ఎల్.మంజునాథ్ కొత్త నివేదిక ఇవ్వనున్నారు.
అగ్రవర్ణాలన్నింటిలోనూ ఆర్థికంగా వెనకబడిన వారికి, చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉపాధి చూసుకుంటున్న వారికి ఎనిమిది శాతం రిజర్వేషను ఇవ్వాలని సిఫార్సు చేసే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు సమాచారం. దీని వాళ్ళ కులాలకతీతంగా పేదలందరికీ న్యాయం జరుగుతుందని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు సమాచారం.
అయితే కాపులకు రిజర్వేషన్లైన అగ్రవర్ణాల పేదలకైనా ఇప్పుడు కేంద్రం చేతిలోనే ఉంది. 50 శాతం దాటితే కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు. దాటితే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవకుండా ఉండాలంటే ఈ అంశాన్ని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలి.
అప్పుడు రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అవసరమైన ప్రక్రియల్ని కేంద్రం పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించనుంది. అయితే ఇది రాజకీయంగా సంక్లిష్టమైన అంశం. దీనిపై బీజేపీ అభిప్రాయం ఎలాఉంటదో చూడాలి. అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం కాపు రిజర్వేషన్లను స్వాగతించారు.



