చంద్రబాబు సీరియస్ … మూడు నెలల్లో ఆరు సర్వేలు!

Chandrababu naidu Ssurvey on sitting TDP MLAఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అప్పుడే ఎన్నికల కసరత్తు మొదలు పెట్టారట. ప్రస్తుతానికి అన్ని నియోజకవర్గాల వారీగా సర్వేలు చేసి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. సిట్టింగు ఎమ్మెల్యేలు ఉన్న చోట వారి పనితీరును భేరీజు వేసే పనిలో ఉండగా, మిగిలిన నియోజకవర్గాలలో అనుకూలమైన అభ్యర్థులను ఫైనల్ చేసే పని లో ఉన్నారు.

ADVERTISEMENT

గడిచిన మూడు నెలల్లో ఆరు సర్వేలు చేసారంటే చంద్రబాబు దీనిపై ఎంత సీరియస్ గా కసరత్తు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏదైనా నియోజకవర్గంలో ఒకరికంటే ఎక్కువ అభ్యర్థులు ఉంటే ఒకరిని ఫైనల్ చేసి మిగతావారికి నామినేటెడ్ పదవి ఇచ్చి సంతృప్తి పరచే పనిలో ఉన్నారు ఆయన.

ఈ కసరత్తు వచ్చి ఆరు నెలలోనే పూర్తి చెయ్యాలని సంకల్పిస్తున్నారు. ఇదేమన్నా ముందస్తుకు వెళ్లే వ్యూహమా అని ప్రత్యర్ధులు ఇప్పటి నుండే ఊహాగానాలు మొదలు పెట్టారు. ప్రస్తుత పరిస్థితులలో ఎటువంటి పొత్తులు లేకుండా 2019 ఎన్నికలకు వెళ్లే పనిలో నిమగ్నం అయ్యారు చంద్రబాబు. దీనిప్రకారమే మొత్తం 175 నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories