ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. అవయవ దానం చేసేందుకు తాను సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అదే విధంగా అవయవ దానాన్ని పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో అవయవదానం ఒక షరతుగా పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
[m9ad]
పది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్చందంగా లక్షా ఇరవై వేల మంది అవయవ దాతలు ముందుకు వచ్చారు. ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్‌లోకి ఈ చారిత్రక ఘట్టాన్ని నమోదు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. తన పిలుపునకు స్పందించి ఇంతమంది ముందుకు రావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తంచేశారు.
నేటి సమాజంలో అవయవ దానం గురించి ప్రచారం చెయ్యవలసిన అవసరం ఎంతో ఉంది. చంద్రబాబు నాయుడు వంటి ప్రముఖులు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఎందరో ఆయనను అనుసరించే అవకాశం ఉంది. దీనికి ఆయనను మెచ్చుకోవలసిందే. దీని ద్వారా ఎందరికో పునర్జన్మ ప్రసాదించిన వారవుతారు.



