కియా… నాడు వద్దనదే నేడు ముద్దైంది!

Chandrababu Naidu Kiaటిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమించి దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ కంపెనీని ఒప్పించి అనంతపురంలో ప్లాంట్‌ ఏర్పాటు చేయించారు. ఆ ప్లాంట్‌లో నేటితో పదిలక్షల ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి అయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కియా మోటార్స్ కంపెనీ యాజమాన్యాన్ని, దానిలో పనిచేస్తున్న కార్మికులకు అభినందనలు తెలిపారు. ఆ ఒక్క కార్ల కంపెనీ ద్వారా రాయలసీమ జిల్లాలలో వేలాదిమంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి లభించింది. ఇందుకు తాను చాలా సంతోస్తున్నానని చంద్రబాబు నాయుడు ట్వీట్‌ చేశారు.

చంద్రబాబు నాయుడు కియా మోటార్స్ కంపెనీకి అనంతపురంలో భూములు కేటాయిస్తున్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లాలో ప్రజలు ఎవరూ కియాకు తమ భూములు ఇవ్వవద్దని హితవు పలికారు. తాము అధికారంలోకి రాగానే కియాను అక్కడి నుంచి తరిమేస్తామని హెచ్చరించారని టిడిపి యువనేత నారా లోకేష్‌ గుర్తుచేశారు.

ADVERTISEMENT

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, చైనాలో ఆ కంపెనీ దివాళా తీస్తే దానిని చంద్రబాబు నాయుడు కమీషన్లకు కక్కుర్తిపడి ఏపీకి తీసుకువచ్చారని, దాని వలన రాష్ట్రానికి, ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదని వాదించారని నారా లోకేష్‌ గుర్తుచేశారు.

ఆ ప్లాంట్‌ ప్రారంభం అయిన తర్వాత యజమాన్యాన్ని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో సహా సీమా జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు వేధించారని, ఒకానొక దశలో ప్లాంట్‌ మూసుకొని వెళ్ళిపోయేందుకు కియా సిద్దపడటంతో వైసీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గిందని నారా లోకేష్‌ అన్నారు.

ఆనాడు కియా మోటార్స్ కంపెనీని ఇంతగా వ్యతిరేకించిన వైసీపీ నేతలే ఇప్పుడు తమ ప్రభుత్వం సహకరించడం వలననే ఆ కంపెనీ 10 లక్షల కార్లు ఉత్పత్తి చేయగలిగిందని గొప్పలు చెప్పుకొంటున్నారని నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు.

అయితే వైసీపీ వేధింపులు తట్టుకోలేక రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోగా, ఈ నాలుగేళ్లలో ఒక్క పెద్ద కంపెనీ కూడా ఏపీకి రాలేదు. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రాష్ట్రానికి రూ.16.53 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటితో అనేక వందల కంపెనీలు, వాటిలో ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప వాటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు నిర్మాణపనులు మొదలుపెట్టలేదు. పైగా ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కనుక పెట్టుబడిదారులు ఎవరూ తొందరపడటం లేదు.

ADVERTISEMENT
Latest Stories