చంద్రబాబు ఐటీ… జగన్ లూటీ..!

Chandrababu-and-Jaganఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే యువతకు తమ సొంత రాష్ట్రంలోనే ఆ స్థాయి ఉద్యోగ అవకాశాలను కల్పించిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కిందనేది జగమెరిగిన సత్యం. తెలుగు రాష్ట్ర ప్రజలకు “ఐటీ” పరిశ్రమలను పరిచయం చేసి, హైదరాబాద్ వంటి మహానగర నిర్మాణానికి బాటలు వేసారు.

హైటెక్ సిటీ, సైబరాబాద్ టవర్స్ వంటి వాటితో దేశం మొత్తం హైదరాబాద్ వైపు తిరిగి చూసేలా చేసిన ఖ్యాతి చంద్రబాబుదే అని స్వయంగా కేటీఆరే ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ ప్రభావమే రాజధానిగా అమరావతి నిర్మాణానికి దోహదం చేసింది. దీంతో ఎస్.ఆర్.ఏం., వీట్ వంటి కేంద్ర విద్యా సంస్థలను, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పారు.

ADVERTISEMENT

అయితే తన కళ్ళ ముందే అమరావతితో సహా రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్నారని జగన్ పాలనపై టీడీపీ అధినేత పెద్ద ఎత్తున విమర్శలు సంధించారు. టీడీపీ ప్రభుత్వం యువతకు “ఐటీ” ఉద్యోగాలను కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ యువతకు “లూటీ” చేసే ఉద్యోగాలను కల్పించిందని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

లిక్కర్ షాపులో ఉద్యోగాలంటూ యువతను మద్యానికి దగ్గర చేశారు. చికెన్… మటన్ …ఫిష్ మార్ట్ లు అంటూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లారని.., జగన్ ఇచ్చేది గోరంత, చెప్పేది కొండంత అంటూ ఫైరయ్యారు. వైసీపీ హయంలో ప్రజలకు ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిపోతున్నాయని, ప్రతి దాని మీద పన్నుల భారం ఎక్కువవుతుందని, చెత్త మీద, మరుగు దొడ్ల మీద చివరకు మహిళల జుట్టు మీద కూడా పన్ను వేస్తారని, ఇలా “పన్నుకు కాదేదీ అనర్హం” అన్న చందంగా జగన్ పాలన కొనసాగుతుందని విమర్శల జోరును పెంచారు బాబు.

మద్యంలో సొంత బ్రాండ్లను తెచ్చి పేదవాడి జేబు కాలీ చేసి జగన్ తన జేబు నింపుకుంటున్నాడని .., బాబాయ్ హత్య కేసు నిందితులను కాపాడే పనిలో జగన్ బిజీగా ఉన్నారని… సొంత చెల్లికి, తల్లికి న్యాయం చేయలేని ఈ జగన్ రెడ్డి ఇక సాధారణ మహిళలకు ఏం న్యాయం చేస్తారో చెప్పమంటూ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శల జోరు పెంచి తెలుగు తమ్ముళ్లను పటిష్ఠ పరచడం చూస్తుంటే ఆంధ్రలో కూడా ముందస్తు ఎన్నికల కోలాహలం కనిపిస్తుందనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఏది ఏమైనప్పటికి పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సహాన్ని నింపడంలో… నాయకులకు జవసత్వాలను పెంచడంలో చంద్రబాబు రాజీ లేని పోరాటం చేస్తున్నారని పార్టీ మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories