చంద్రబాబు ‘నోట’ మరోమారు ‘సాక్షి’ స్వాధీనం!

Chandrababu naiduఅవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన ‘సాక్షి’ పత్రికను ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఇప్పటికే పలు సందర్భాలలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు అలాంటి వ్యాఖ్యలే వ్యక్తమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురంలో ప్రసంగించిన చంద్రబాబు, “ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న పత్రిక సాక్షి” అంటూ భీకర స్వరం వినిపించారు.

ADVERTISEMENT

ముఖ్యంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కధనాలు ప్రచురితం చేస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బంగారుమయం అయిపోతుందంటూ… అన్ని ప్రశ్నలకు ప్రత్యేక హోదా ఒక్కటే సమాధానం అన్నట్లు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ‘సాక్షి’ పత్రిక పని చేస్తోందని, అవినీతి ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు, అవినీతి సొమ్ములో భాగమైన సాక్షి పత్రిక కూడా ప్రభుత్వ పరం అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు.

అయితే గతంలో కూడా సాక్షి కధనాలపై ఆగ్రహం కూడిన వ్యాఖ్యలు చేసిన ఏపీ సిఎం మాటలను ‘సాక్షి’ పత్రిక పట్టించుకున్నట్లు లేదు. కధనాలలో, ప్రసారాలలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనించదగ్గ విషయం. ఒకవేళ చంద్రబాబు చెప్పినట్లు… నిజంగానే సాక్షి పత్రికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే… మీడియా హక్కుల నేపధ్యంలో కొత్త ఉద్యమానికి తెరలేపే యోచనలో యాజమాన్యం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.

ADVERTISEMENT
Latest Stories