
యువ ముఖ్యమంత్రి అంటే అదేదో మాస్టర్స్ డిగ్రీతో లభించే ప్రత్యేక అర్హత అనుకునే మాజీ సిఎం జగన్, ఎప్పటికప్పుడు అందివస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోలేకపోయారు. తన ఐదేళ్ళ పాలనలో మూడు రాజధానులు, వాలంటీర్లు, సచివాలయాలు, సంక్షేమ పధకాలు అంటూ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రజలపై అదనపు భారం మోపారు.
కానీ 74 ఏళ్ళ వయసున్న సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీ గురించి తెలుసుకొని, అవగాహన పెంచుకుంటూ దానిని పాలనా వ్యవహారాలకు, రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకుంటున్నారు.
Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?
దానిలో భాగంగానే నేటి నుంచి వాట్సప్ ద్వారా ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు.
ఇప్పుడు దాదాపు ప్రతీ ఒక్కరూ వాట్సప్ వాడుతున్నారు. కనుక ఆ మొబైల్ యాప్‌ని దీని కోసం వాడుకోవాలనే సిఎం చంద్రబాబు నాయుడు ఆలోచన ఆయన దూరదృష్టికి నిదర్శనంగా భావించవచ్చు.
Also Read – బీజేపి విజయంలో చంద్రబాబు… కొందరికి ఎసిడిటీ తప్పదు!
మంత్రి నారా నేడు లోకేష్ ‘వాట్సప్ గవర్నెన్స్’ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలిదశలో 161 రకాల సేవలు దీని ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు.
ఇప్పుడు సైబర్ నేరాలు బాగా పెరిగిపోయినందున ‘వాట్సప్ గవర్నెన్స్’ పేరుతో సైబర్ నేరగాళ్ళు సామాన్య ప్రజలను మోసగించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక వాట్సప్ నంబర్ నేడు ప్రకటిస్తారు. బ్లూ టిక్ కలిగిన ఆ నెంబర్‌ని మాత్రమే రాష్ట్ర ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకొని ప్రభుత్వం అందించే అన్ని సేవలు పొందవచ్చు.
వాట్సప్ గవర్నెన్స్ ద్వారా విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్ను బకాయిలు, చెల్లింపులు, కుల, ఆదాయం, చిరునామా ధృవీకరణ పత్రాలు, స్థిరాస్తులకు సంబందించి ఈసీ వంటి పత్రాలు, సంక్షేమ పధకాలకు దరఖాస్తులు, ఏపీఎస్ ఆర్టీసీ టికెట్ బుకింగ్స్ ఇలా.. మీసేవ లేదా ప్రభుత్వ కార్యాలయాలలో లభిస్తున్న అన్ని సేవలను పొందవచ్చు.
అలాగే వివిద సమస్యలపై ప్రభుత్వానికి పిర్యాదులు చేయవచ్చు. అంటే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండానే అన్ని పనులు చక్కబెట్టేయవచ్చన్న మాట!
చట్టబద్దత, ఉద్యోగ భద్రత లేని వాలంటీర్ వ్యవస్థతో ప్రజల ఇళ్ళ వద్దకే సేవలు అంటూ జగన్ గొప్పగా చెప్పుకునే వారు. కానీ వైసీపీ దానిని ఎంతగా దుర్వినియోగం చేసిందో అందరూ చూశారు. ఐదేళ్ళు వాలంటీర్లతో వెట్టి చాకిరీ చేయించుకొని చివరికి అందరినీ రోడ్డున పడేసిపోయారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకుంటూ ‘వాట్సప్ గవర్నెన్స్’తో అంత కంటే మెరుగైన సేవలే అందించబోతున్నారు.
మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం ‘మన మిత్ర’ పేరుతో వాట్సప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక వాట్సప్ నంబర్: 9552300009. బ్లూటిక్ కలిగిన ఈ నెంబరుని రాష్ట్ర ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకొని వాట్సప్ ద్వారా వివిద రకాల ప్రభుత్వ సేవలు పొందవచ్చు.