ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి గమనిస్తే ఆయన విజయవాడ బీసెంట్ రోడ్ లాంటి ఒక చిన్న వ్యాపార సెంటర్ లోను దుబాయ్ వంటి ఒక విదేశీ పర్యటనలోను ఒకే తీరుగా నడుచుకుంటున్నారు.
ఒక బడా పారిశ్రామిక వేత్త అయినా ఒక చిరు వ్యాపారి అయినా ఆర్థికంగా బలంగా ఉండాలి అనే ఆయన ఆలోచన, వారి వ్యాపారం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎంతోకొంత ప్రయోజనకరంగా ఉండాలి అనే ఆయన తపన నిజంగా హర్షణీయం.
గత ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి కి తాడేపల్లి ప్యాలస్ గేట్ దాటి బయటకు రావాలంటే పరదాలు, దేశం విడిచి విదేశాలకు వెళ్లాలంటే పర్మిషన్లు కావాల్సి వచ్చేది. కానీ నేటి ముఖ్యమంత్రి బాబు కి ప్రజలను కలవడానికి పరదాలు లేవు, విదేశీ పర్యటనలు చేయడానికి కోర్ట్ అనుమతులు అవసరం లేదు.
పెట్టుబడుల ఆహ్వానానికి దుబాయ్ వీధులలో అయినా చిరు వ్యాపారులకు చేయూత నివ్వడానికి విజయవాడ వీధులలో అయినా ఒకే రకంగా తిరగగల ప్రజా నాయకుడిగా బాబు ప్రజామోదం పొందారు, ఇప్పటికి పొందుతున్నారు కూడా.
బాబు విదేశీ పర్యటనలు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే ఆయన ఏపీ వీధులలో చేస్తున్న ఆకస్మిక పర్యటనలు సామాన్య ప్రజలలో భరోసాను కల్పిస్తున్నాయి. ప్రతి నెల ఒకటవ తేదీన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక సామాన్య ఉద్యోగి మాదిరి ఒక పేద కుటుంబాన్ని సందర్శించి తన చేతుల మీదుగా ఆ కుటుంబానికి పెన్షన్ అందిస్తున్నారు.
అలాగే బడా పారిశ్రామిక వేత్తల కోసం, పరిశ్రమల నిర్మాణం కోసం వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పెట్టుబడి దారులకు అందించేందుకు సిద్ధంగా ఉంటారు. 4 వేల పెన్షన్ అయినా 4 వేల కోట్ల పెట్టుబడులైన అంతే శ్రద్దగా, చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు బాబు.




