
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి సెంటిమెంట్ రాజకీయాలను ప్రవేశపెట్టి, అవసరమైనప్పుడల్లా ఎడాపెడా వాడేసుకుంటోంది. కృష్ణా, గోదావరి జలాలను కూడా ఆ సెంటిమెంటుతో మూడేసి వాడేసుకుంటుంది.
గోదావరి మిగులు జలాలను రాయలసీమ జిల్లాలకు నీళ్ళు అందించేందుకు బనకచర్ల ప్రాజెక్ట్ చేపట్టబోతోంది. కనుక తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేసేందుకు సెంటిమెంట్ దొరికింది. ఆ ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్ళు ఏపీకి తరలించుకుపోతుంటే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చేతులు ముడుచుకొని చూస్తున్నారంటూ కేటీఆర్, హరీష్ రావు తదితర బిఆర్ఎస్ పార్టీ నేతలు రోజూ విమర్శలు మొదలుపెట్టేశారు.
Also Read – మీరు ఎమ్మెల్యేలయ్యా… దొంగలుకారు!
తాము అధికారంలో ఉండి ఉంటే తెలంగాణకు చెందిన ఒక్క చుక్క నీరు కూడా ఏపీ తరలించుకుపోకుండా కాపాడేవారిమని పదేపదే వాదిస్తున్నారు. ఇటువంటి మాటలు నీళ్ళ కోసం ఎదురుచూస్తున్న రైతులకు సరిగ్గా చేరుతాయి. కనుక తెలంగాణ ప్రభుత్వం అసమర్ధత వల్లనే తమకు నీళ్ళు రావడం లేదని, ఈ కాంగ్రెస్ పాలన బాగోలేదని భావించడం మొదలుపెడతారు.
సమాజంలో ఒక్కో వర్గం ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలు ఈవిదంగా ఒక్కో ట్రిక్ ప్లే చేస్తూ, తమ రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుంటాయి.
Also Read – రచ్చ గెలిచేసాడు.. మరి ఇంట..?
ఈ విషయం దేశ ముదురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తెలియదనుకోలేము. కనుక బిఆర్ఎస్ పార్టీ వలన తమ పార్టీకి నష్టం కలగకుండా ఉండేందుకు వారు కూడా బనకచర్ల ప్రాజెక్టు-ఏపీ జల దోపిడీ అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు.
వారు ఆవిదంగా ఎందుకు మాట్లాడుతున్నారో సిఎం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. కనుక వారికి తగినవిదంగానే జవాబిచ్చారు.
Also Read – కొరకరాని కొయ్యలా పవన్ ….. ఎలా డీల్ చేయాలబ్బా!
ఈ అంశం గురించి మాట్లాడుతూ, “తెలంగాణ ఏపీకి ఎగువన ఉంది. అక్కడి నుంచి కిందకు పారిన గోదావరి నీటిని మేము వాడుకోగా మిగిలింది సముద్రంలో కలిసిపోతోంది. కనుక ఆ నీటిని మాత్రమే మేము బనకచర్లతో రాయలసీమకు మళ్లించి అక్కడి ప్రజల త్రాగు, సాగు నీటి కష్టాలు తీర్చాలనుకుంటున్నాము.
ఎగువన ఉన్న తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకొని తెలంగాణ జిల్లాలకు నీళ్ళు అందిస్తే మేము తప్పు పట్టడం లేదు. నిజానికి గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసే బదులు రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటే మంచిది కదా?
కనుక మా వాటాగా రావాలసిన నీళ్ళు మాకు అందుతున్నంత కాలం, ఎగువన గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు నిర్మించుకున్నామాకేమీ అభ్యంతరం లేదు. నీళ్ళని సద్వినియోగం చేసుకోవడానికే ప్రాజెక్టులు తప్ప రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదు,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విషయం ప్రజలకు, రైతులకు అర్దమయ్యేలా వివరించగలిగితే, కృష్ణా గోదావరి నదులతో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ నీటి సెంటిమెంట్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయవచ్చు.