ప్రజలు జగన్‌ని నమ్మరు… ఆయన తన ఎమ్మెల్యేలను నమ్మరు!

CBN Speech at Tiruvuru

ఈరోజు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో టిడిపి అధ్వర్యంలో ‘రాష్ట్రంలో కడలి రా’ పేరిట భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీగా టిడిపి శ్రేణులు, ప్రజలు తరలిరావడం సభా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఈ సభలో చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

· రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్‌ రెడ్డిని నమ్మడం లేదు. ఆయనేమో తన మంత్రులు, ఎమ్మెల్యేలను నమ్మడం లేదు. దీంతో వైసీపిలో ఎవరూ ఎవరినీ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

ADVERTISEMENT

· దేశంలో అధికారులు, ఉద్యోగులు బదిలీ అవడం చూశాము. కానీ ఎమ్మెల్యేల బదిలీని ఎప్పుడైనా చూశారా తమ్ముళ్ళూ?

· మనింట్లో చెత్తని తీసుకెళ్ళి పక్క ఇంటి ముందు పడేస్తే ఎవరైనా ఊరుకొంటారా? అలాగే ఓ నియోజకవర్గంలో పనికిరాని చెత్త ఎమ్మెల్యేని మరో నియోజకవర్గంలోకి పంపిస్తే అక్కడి ప్రజలు గెలిపిస్తారా? ఓ నియోజకవర్గంలో చెల్లని కాసు
మరో నియోజకవర్గంలో బంగారం అయిపోతుందా?

· జగన్‌ తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు ఎలాగూ బలైపోతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆయన బలిచేస్తున్నారు.

· మూడు రాజధానులంటూ జగన్‌ చేసిన ఓ పిచ్చి ఆలోచన వల్లనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 30 ఏళ్ళు వెనక్కి పోయింది. ఓ పక్క హైదరాబాద్‌ వెలిగిపోతుంటే, అమరావతి వెలవెలపోతోంది.

· ఇప్పుడు ఆయన సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బాధితులుగా మారారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.

· జగన్‌ తుగ్లక్ పరిపాలనలో నాతో సహా రాష్ట్ర ప్రజలందరూ బాధితులే.

· మన తెలుగు పిల్లలకు నేను ఐ‌టి అనే ఆయుధం అందించాను. దానిని అందిపుచ్చుకొన్న మన యువత ప్రపంచంలో ఐ‌టి రంగాన్ని శాసిస్తున్నారు. కానీ ఐ‌టి రంగంలో మన ఆంధ్రప్రదేశ్‌ స్థానం ఇప్పుడు ఎక్కడుంది? ఈ
నాలుగేళ్ళలో ఈ జగన్‌ ప్రభుత్వం ఒక్క ఐ‌టి కంపెనీని తీసుకు రాగలిగిందా?

· రాష్ట్రంలో ఉన్నవాటినే జగన్‌ ప్రభుత్వం బయటకు తరిమేసింది. పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నాయి. జగన్‌ పేరు వింటే చాలు… అందరూ హడలిపోతున్నారు.

· ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటువంటి దయనీయ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఎవరి వల్ల ఏర్పడ్డాయి? అని ప్రశ్నించుకుంటే ఒకే ఒక్కడు… ఆయనే జగన్మోహన్‌ రెడ్డి. ఆయన అనాలోచిత నిర్ణయాల వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది.

· ఒకప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ పోరాడారు. ఆ మహానుభావుడి వలన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గర్వంగా తలెత్తుకోగలిగారు. కానీ ఈ తుగ్లక్ జగన్మోహన్‌ రెడ్డి వలన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దేశ ప్రజల ముందు సిగ్గుతో
తలదించుకోవలసి వస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.

ADVERTISEMENT
Latest Stories