
‘సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దావోస్ సదస్సు కోసం వంద కోట్లు ఖర్చు పెట్టేశారు. కానీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తేకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చారంటూ’ వైసీపీ నేతలు, వారి సొంత మీడియా ఎద్దేవా చేసింది.
కానీ బిల్ గేట్స్ వంటి ప్రముఖులతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొనగలిగిన సిఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడులు సాధించకుండా ఎలా తిరిగి వచ్చారని, దానిలో మర్మమేమిటని ఆలోచించలేదు.
Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!
ఆ సదస్సులో పాల్గొన్న తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు అసలు విషయం బయటపెట్టారు.
హైదరాబాద్‌లో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు, “దావోస్ సదస్సులో తెలంగాణకు రూ.1.78 లక్షల కోట్లు పెట్టుబడులు రాగా, ఏపీకి ఒక్క రూపాయి కూడా ఎందుకు రాలేదు? కారణం ఏమిటి?” అని ఓ విలేఖరి ప్రశ్నించగా, “ఏపీకి పెట్టుబడులు రాలేదని అందరూ అనుకుంటున్నారు. కానీ సదస్సులో చాలా కంపెనీలతో ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా జరిగాయి.
Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?
అయితే ఈ విషయం బయట పెట్టకూడదని సిఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకే తమ బృందం ఎటువంటి ప్రకటనలు చేయలేదని మంత్రి నారా లోకేష్ నాతో చెప్పారు. ఏపీకి తిరిగి వెళ్ళిన తర్వాతే వాటి గురించి వివారిస్తామని నారా లోకేష్ చెప్పారు. దీనిని బట్టి సిఎం చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అర్దమవుతోంది. అదేమిటో త్వరలోనే తెలుస్తుంది.
పెట్టుబడులు ఆకర్షించే విషయంలో రెండు రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ ‘హైదరాబాద్‌కి మరిన్ని ఐటి కంపెనీలు, పెట్టుబడులు రావాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని’ సిఎం చంద్రబాబు నాయుడు చెప్పడం మాకు చాలా సంతోషం కలిగించింది.
Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?
ఆయన దృష్టి అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపైనే ఉంది. ఏపీకి సువిశాలమైన సముద్రతీరంతో సహా అనేక సహజ వనరులున్నాయి. వాటన్నిటినీ నూటికి నూరు శాతం వినియోగించుకుంటూ ఏపీని అభివృద్ధి చేసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.
ఆయన నేతృత్వంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో శరవేగంగా అభివృధ్ది చెందుతుందని నాకు అనిపించింది,” అని మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడే ‘అభివృద్ధిలో పోటీ పడదాం.. రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని’ తెలంగాణ సిఎం కేసీఆర్‌కి సూచించేవారు. కానీ ఆయన ఏపీని, చంద్రబాబు నాయుడుని తొక్కేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నారు. పైగా జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ దయనీయ పరిస్థితిలోకి జారుకుంటే కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ మంత్రులు అవహేళన చేసేవారు కూడా.
నాడు వారు ఆవిదంగా వ్యవహరించినప్పటికీ సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం నేటికీ అదే మాటకు కట్టుబడి, హైదరాబాద్, తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకోవడం.. ఈ విషయం తెలంగాణ మంత్రి చెప్పడం చాలా అభినందనీయం.
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు తమ తమ రాష్ట్రాలకు పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు పోటీ పడుతూనే, పొరుగు రాష్ట్రం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నారు. ఇది చాలా ఆరోగ్యకరమైన పోటీ.. ఆరోగ్యకరమైన మార్పే కదా?