‘రంజాన్’ వేళ ‘చార్మినార్’ అందాలు ‘అద్భుతం’

Charminar Ramadan, Charminar Ramadan Beauty, Charminar Ramadan Season, Charminar Ramadan Hyderabad, Charminar Ramadan Market  రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలలో రోజూ రద్దీగా ఉండే రహదారులు వెలవెలబోయాయి. అయితే ఎక్కడ ఎలా జరుపుకున్నా… హైదరాబాద్ లో రంజాన్ మాత్రం స్పెషాలిటీ. ఎంత ప్రత్యేకం అంటే… రంజాన్ పర్వదినాన్ని నాశనం చేసేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నేటంత! పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసారు కాబట్టి… ప్రస్తుతం హైదరాబాద్ లో రంజాన్ శోభ సంతరించుకుంది గానీ, లేకుంటే ఊహకు అందని విషాదం మిగిలి ఉండేది.

చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ తీరనాళ్ళ మాదిరి జనసమూహంతో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా బుధవారం నాటి సాయం సంధ్య వేళలో చార్మినార్ పరిసరాలన్నీ విద్యుత్ దీపాల కాంతిలో కళకళలాడుతున్నాయి. చార్మినార్ టాప్ యాంగిల్ నుండి తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పండుగ శోభ అంటే ఇది అని చెప్పుకునే విధంగా చేసుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఈ సందర్భంగా మరోసారి ‘రంజాన్’ శుభాకాంక్షలు చెప్దాం..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories