చెత్తపన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త?

chetta-pannu-vizianagaram-andhra-pradeshఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరూ చెత్తపన్ను… చెత్త ప్రభుత్వం అని వైసీపీ ప్రభుత్వాన్ని రోజూ తిట్టుకొంటూనే ఉన్నారు. ప్రభుత్వానికి ఆ పేరును సార్ధకం చేసేందుకు విజయనగరంలో మున్సిపల్ సిబ్బంది చెత్తకుండీలలో చెత్తను తీసుకువచ్చి ఓ అపార్టుమెంట్ ఆవరణలో పారబోయడంతో దానిలో నివసిస్తున్నవారు షాక్ అయ్యారు. చెత్తపన్ను కట్టనందుకు ఆవిదంగా చేస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెప్పారు. తమ పైఅధికారుల ఆదేశం మేరకు ఆవిదంగా చేస్తున్నామని చెప్పి ఇంటి ఆవరణలో చెత్తపారబోసి వెళ్ళిపోయారు. అపార్టుమెంట్‌లో నివసిస్తున్నవారు దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

ఇంటిపన్నులోనే పారిశుద్య ఖర్చులు కూడా ఉంటాయని మళ్ళీ అదనంగా చెత్తపన్ను ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్‌ ఛార్జీలు, మళ్ళీ ట్రూఅప్ పేరుతో అదనంగా ఛార్జీలు వసూలు చేస్తోందని, ఇంటిపన్నుని పెంచుకొనేందుకు మార్కెట్ ధరలతో ముడిపెట్టి పన్ను పెంచుకొంటోందని వారు ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చక్కటిపాలన అందిస్తామని చెప్పిన తమ ఓట్లు పొందిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఈవిదంగా ఇంటిముందు చెత్తపారబోసి ప్రజలను అవమానిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు వేలకోట్లు బకాయిలు పడినా చెల్లించదు. కానీ సామాన్య ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించడం ఆలస్యమైతే సిబ్బంది వచ్చి ఫ్యూజులు పీకేసి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తుంటారు. అదేవిదంగా ఇప్పుడు చెత్తపన్ను చెల్లించకపోతే ఇంటి ముందు చెత్తపారబోసి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఎన్ని సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నా ప్రజలను ఈవిదంగా పీడిస్తూ, ఇబ్బంది పెడితే మళ్ళీ అధికారంలోకి రాగలమా? అని వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకొంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories