chhaava-roars-in-telugu

ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ ఇప్పటికే హిందీ భాషా ప్రియుల మన్ననలు పొందింది. ఈ ఏడాదిలో రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రాలలో ఛావా మొదటి స్థానంలో దూసుకుపోతుంది.

మిక్కీ కౌశల్, అక్షయ్ కన్నా, రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఛావా మూవీలో శంభాజీ పాత్రకు తన నటనతో ప్రాణం పోశారు మిక్కీ కౌశల్. ఈ మూవీ ఆయన సినీ కెరీర్ లో ఎప్పటికి ఒక మైలు రాయిగా నిలిచేలా శంభాజీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు మిక్కీ.

Also Read – అందరికీ సారీ.. అదిదా సర్‌ప్రీజు!

అయితే ఛావా తెలుగు వర్షన్ ను ఈ నెల 7 న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు గీత ఆర్ట్స్. ఈ నేపథ్యంలో ఈ రోజు ఛావా తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేసింది గీతా ఆర్ట్స్. అయితే తెలుగులోనూ అదే సింహ గర్జన అన్న విధంగా శంభాజీ గా మిక్కీ నటనకు తెలుగు డబ్బింగ్ చక్కగా అతికినట్టుంది.

అదే గంభీర స్వరం, అంతే చక్కటి డబ్బింగ్ మాడ్యులేషన్స్ తో ట్రైలర్ చూడడానికే కాదు ఇప్పుడు వినడానికి కూడా వీనుల విందుగా ఉంది. గీతా ఆర్ట్స్ వంటి వంటి బిగ్ బ్యానేర్ ద్వారా సినిమా థియేటర్లలోకి రానుండడంతో డబ్బింగ్ లో ఎక్కడా కాంప్రమైసింగ్ ధోరణిలో కాకుండా పూర్తి నాణ్యత ప్రమాణాలతో ఛావా తెలుగు ట్రైలర్ తెలుగు వారిని పూర్తిగా మెప్పించిందనే చెప్పాలి.

Also Read – ఒకరిది భాషోద్వేగం..మరొకరిది ప్రాంతీయవాదం..మరి ఏపీ.?

ఒక పోరాట యోధుడి జీవిత చరిత్రను ఛావా రూపంలో భవిష్యత్ తరానికి చెప్పడానికి దర్శకుడిగా లక్ష్మణ్ ఉటేకర్ చేసిన ఈ ప్రయత్నం, నిర్మాతగా దినేష్ చేసిన సాహసం పై సర్వత్రా ప్రసంశలు వెలువడుతున్నాయి.




శంభాజీ తో తలపడే ఔరంగ జేబు వంటి కఠినాత్ముడి పాత్రలో అక్షయ్ కన్నా, శంభాజీ భార్య యేసుబాయ్ పాత్రలో రష్మిక మందన అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. మార్చి 7 న వెండితెర మీద ఛావా తెలుగు సింహ గర్జన షురూ….ఇక తెలుగు ఆడియెన్స్ గెట్ రెడీ ఫర్ ఛావా థియేట్రికల్ ఎక్సపీరియెన్స్..!

Also Read – బెట్టింగ్ రాజాలు…సిద్ధమా.?