Chinab Bridge Vande Bharat

ఒకప్పుడు.. అంటే దేశాన్ని యూపీయే ప్రభుత్వం పాలిస్తున్నప్పుడు, దేశంలో దానంతటదే జరిగే అభివృద్ధి తప్ప ప్రభుత్వం పూనుకొని చేసిందేమీ పెద్దగా కనబడేది కాదు. కానీ ప్రధాని మోడీ వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వమే పూనుకొని అన్ని రంగాలలో దేశాన్ని అభివృద్ధి చేస్తోంది.

అహ్మదాబాద్-ముంబై మద్య బుల్లెట్ రైలు, అత్యాధునిక సదుపాయాలతో వందే భారత్‌ రైళ్ళు, జమ్ము కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలలో భారీగా టన్నల్స్, వంతెనలు, మౌలిక సదుపాయాలు, దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణ, కొత్తగా రైల్వే లైన్ల నిర్మాణం, విమానాశ్రయాల నిర్మాణం, రక్షణ రంగానికి అత్యాధునిక యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, హెలికాఫ్టర్లు, ఆయుధాలు.. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి.

Also Read – దేశంలో ఇక బీజేపి ఒక్కటే… అడ్డేలే!

బీజేపి రాజకీయాలను, మతతత్వవాదాన్ని పక్కన పెట్టి చూస్తే ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం గత 10 ఏళ్ళలో దేశాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిందని చెప్పొచ్చు.

ఆ అభివృద్ధి జాబితాలో ప్రపంచంలో కెల్లా ఎత్తైన రైల్వేబ్రిడ్జి కూడా ఒకటి. కశ్మీర్‌ని దేశంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా రూ.14,000 కోట్లు వ్యయంతో చినాబ్ వంతెన నిర్మింపజేశారు. అంత ఎత్తులో అంత వ్యతిరేక వాతావరణంలో అక్కడ వంతెన నిర్మించడం అసాధ్యమని పలువురు వాదించారు. కానీ నిర్మించడమే కాదు దానిపై నేడు రైళ్ళు కూడా నడిపిస్తున్నారు.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?

చినాబ్ నదికి 359 మీటర్ల ఎత్తున రెండువైపులా కొండలని కలుపుతూ 1,315 మీటర్లు పొడవు గల ఈ రైల్వేబ్రిడ్జిపై నేడు తొలిసారిగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దూసుకుపోయింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు చలీ కాలం మొదలైతే కశ్మీర్‌కి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతుండేవి. కానీ భారీగా మంచు కురుస్తున్నా తట్టుకునేందుకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుని ప్రత్యేక ఏర్పాట్లతో తయారుచేశారు.

Also Read – వ్యవస్థలకి జగన్‌ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!

అదే నేడు ప్రపంచంలో కెల్లా ఎత్తైన రైల్వేబ్రిడ్జిపై నుంచి దూసుకుపోయింది. కాత్రలోని శ్రీమాత వైష్ణోదేవి రైల్వే స్టేషన్‌ నుంచి శ్రీనగర్‌కు చేరుకుంది. అది రైల్వే వంతెనపై దూసుకుపోతున్నప్పుడు తీసిన వీడియోని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.