చివరికి జీయర్ స్వామి కూడా అనేశారు

chinna_jeeyar_swamy_comments_on_andhra_pradesh_roads>త్రిదండి చిన్న జీయర్ స్వామి బుదవారం హైదరాబాద్‌ నుంచి జంగారెడ్డి గూడెం మీదుగా రాజమహేంద్రవరానికి కారులో వచ్చారు. అక్కడ జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కొన్ని రోడ్లపై గోతులు ఉండవచ్చు. కనుక ఎవరికైనా ప్రయాణంలో ఒడిదుడుకులు తప్పవు. జంగారెడ్డి గూడెం నుంచి రాజమహేంద్రవరానికి రావడం… ఆ ప్రయాణం నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది,” అని వ్యంగ్యంగా అన్నారు.

ఆయన అన్నది ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి గురించే అని అర్ధమవుతూనే ఉంది. ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సహా ఆ రాష్ట్ర మంత్రులు ఓసారి ఏపీలో రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడటంతో ఏపీ ప్రభుత్వం హడావుడిగా రూ.1,080 కోట్లు కేటాయించి యుద్ధప్రాతిపదికన రోడ్లు మరమత్తులు చేయించేందుకు టెండర్లు పిలిచింది. కానీ ఆ ప్రక్రియ మొదలయ్యేలోగా జీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడంతో ఆయన కూడా ఏపీ రోడ్ల గురించి ఓ మాటనేశారు. ఏం చేస్తాం…మన బొంతకు కంత ఉంటే అందరికీ లోకువే కదా?

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories