ప్రస్తుతం ‘ఖైదీ నంబర్ 150’ సెట్స్ పైనున్న మెగాస్టార్ చిరంజీవి, త్వరలో బుల్లితెరపై కూడా సందడి చేయనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ నుండి బుల్లితెరపై ప్రదర్శితం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కు సంబంధించిన ప్రోమో టీజర్ ను దసరా సందర్భంగా అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నారు. ఈ ప్రోగ్రాంలో ‘కింగ్’ నాగార్జున సూపర్ సక్సెస్ అయిన నేపధ్యంలో… చిరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అన్న ఆసక్తి అభిమాన వర్గాల్లో నెలకొంది.
బహుశా విడుదల కానున్న కొత్త ప్రోమో దీనిపై కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ కెరీర్ లో ఇప్పటివరకు బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమం చేయకపోవడంతో, మొదటిసారే ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారు? అన్న సందేహమైతే అభిమాన వర్గాల్లోనూ ఏదొక మూలాన దాగి ఉంది. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడిగా సామాజిక బాధ్యతలను చిరు విస్మరించాడన్న ముద్ర పడిన నేపధ్యంలో… ఈ కార్యక్రమంలో భాగస్వామి కాబోయే సామాన్యుల పట్ల చిరు రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
బహుశా ఈ ‘దసరా’ మెగా అభిమానుల ‘సరదా’ తీర్చేయవచ్చు..!



