‘శ్రీమంతుడు’ రికార్డులు సేఫ్… ఇక ‘ఖైదీ’ కొట్టలేదు..!

Chiranjeevi Khaidi-No-150-overseas recordsపదేళ్ళ తర్వాత మెగాస్టార్ సిల్వర్ స్క్రీన్ పైకి రావడంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు “ఖైదీ నంబర్ 150” సినిమాకు బ్రహ్మరధం పట్టారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిసింది. తొలి నాలుగు రోజుల్లో రికార్డు వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఇప్పటికీ మాస్ సెంటర్స్ లో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ నే సాధిస్తోంది. ఈ ప్రభంజనంతో మెగాస్టార్ ఏకంగా టాప్ 2 స్థానానికి చేరుకున్నారు అనేది అనధికారికంగా వినిపిస్తున్న సమాచారం. కొన్ని ఏరియాలలో ‘బాహుబలి’ రికార్డులనే బీట్ చేయడంతో ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదు.

ADVERTISEMENT

ఏపీ, తెలంగాణాల వరకు ‘బాహుబలి’ తర్వాత స్థానం ‘ఖైదీ నంబర్ 150’దే అన్న విషయం దాదాపుగా ఖరారైంది. అయితే అది అధికారికంగా డిక్లేర్ చేయాల్సి ఉంది. స్థానికంగా దుమ్ము దులిపిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ ను అందిపుచ్చుకుంది. వచ్చి రావడంతోనే 2 మిలియన్ క్లబ్ లోకి చేరిపోయిన మెగాస్టార్, ఇక్కడ మాత్రం ‘శ్రీమంతుడు’ రికార్డులను చేరుకోలేకపోయారు. ఓవర్సీస్ లో ‘బాహుబలి, శ్రీమంతుడు, అ…ఆ…’ సినిమాలు తొలి మూడు స్థానాలలో ఉండగా, అంతిమంగా ‘ఖైదీ నంబర్ 150’ మూడవ స్థానానికి చేరుకుంటుందేమోనని అంచనాలు వేస్తున్నారు.

సినిమా విడుదలైన తొలి రోజుల్లో అంచనాల ప్రకారం ‘శ్రీమంతుడు’ కలెక్షన్స్ ను దాటి 3 మిలియన్ క్లబ్ లోకి చేరుకుంటుందని భావించారు. అయితే ‘శాతకర్ణి’ విడుదల తర్వాత ఓవర్సీస్ లో ‘ఖైదీ’ ప్రభంజనం తగ్గగా, ‘శతమానం భవతి’ కూడా కొంతమేర అడ్డుకట్ట వేసింది. దీంతో ప్రస్తుతం 2.30 మిలియన్స్ వద్ద ఉన్న ‘ఖైదీ నంబర్ 150’ 2.50 సంఖ్యను అందిపుచ్చుకుంటాడేమో చూడాలి. అయితే 2.89తో రెండవ స్థానంలో ఉన్న ‘శ్రీమంతుడు’ దగ్గరికి చేరుకోవడం మెగాస్టార్ సినిమాకు అసాధ్యమనే చెప్పవచ్చు. స్థానిక మార్కెట్ లో మెగాస్టార్ రికార్డులు సృష్టించారు గానీ, ఓవర్సీస్ లో మాత్రం గత రికార్డులను బద్దలు కొట్టలేకపోయారు.

ADVERTISEMENT
Latest Stories