మెగాస్టార్ చిరంజీవి రాజకీయ తెరంగ్రేటం చేసిన నాటి నుండి, కెరీర్ అంతా తిరోగమన దిశలో పయనిస్తోంది. కానీ ఈ సంక్రాంతికి విడుదలైన ‘ఖైదీ నంబర్ 150’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో, మెగాస్టార్ మళ్ళీ ‘బ్యాక్ టు ఫాం’ అని భావించారు. అదే ఊపులో బుల్లితెరపై కూడా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రూపంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఇది అట్టర్ ఫ్లాప్ షోగా మారిపోవడం, మెగా అభిమానులకు జీర్ణించుకోలేని అంశంగా మారింది.
ఈ షో ప్రారంభమైన నాటి నుండి ఆశించిన టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకోలేకపోయిందని, ఇంకా చెప్పాలంటే కనీసం డైలీ సీరియల్స్ రేంజ్ ను కూడా అందుకోలేకపోయిందని విమర్శలు ఎదురయ్యాయి. దీంతో నాగార్జున వంటి స్టార్ హీరోలు చిరుతో కలిసి స్పెషల్ షోలు చేసారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని, ఈ సీజన్ అత్యంత దారుణమైన రేటింగ్స్ ను తెచ్చుకుందని సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది.
నిజానికి చిరు వంటి స్టార్ హీరో కార్యక్రమానికి ఆదరణ ఒక రేంజ్ లో ఉండాలి. ‘రేంజ్’ పక్కన పెడితే, కనీసం ‘సాధారణం’గా కూడా లేకపోవడం గమనించదగ్గ విషయం. దీంతో స్కూల్ పిల్లలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. పిల్లలతో ఎపిసోడ్ అయితే ఫ్యామిలీ మొత్తం ఖచ్చితంగా చూస్తారనే ఎత్తుగడతో ఈ ప్లాన్ వేసినట్లుగా చెప్పుకుంటున్నారు. చూడబోతుంటే… మెగాస్టార్ ను ఒక్క బిగ్ స్క్రీన్ పైన తప్ప, పొలిటికల్ కెరీర్ లో, బుల్లితెర కెరీర్ లో ప్రేక్షకులు తిప్పికొట్టినట్లుగా స్పష్టమవుతోంది.



