Chiru Modi Pavan

తన అహాన్ని చల్లబరుచుకోవడానికి అధికారాన్ని, పదవిని అడ్డుపెట్టుకున్న వ్యక్తి పాలన ఎలా ఉంటుందో గడిచిన ఐదేళ్లలో జగన్ రాష్ట్రానికే కాదు దేశానికే తెలియచెప్పారు. టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన రాజధానిని నేనెందుకు కొనసాగించాలి అనే అహంతో రాజధాని అమరావతిని నిలువునా మూడు ముక్కలుగా చీల్చారు జగన్.

అలా చీల్చిన మూడు ప్రాంతాలలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా అభివృద్ధి పేరుతో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు జగన్. ఇప్పుడు అదే జగన్ అహం మీద కొట్టి రాష్ట్రానికి మూడు కాదు ఒక్కటే రాజధాని అది అమరావతి అని 164 నియోజకవర్గాలలో గట్టిగా బటన్ నొక్కి మరి చెప్పారు ఏపీ ప్రజానీకం. దీనితో జగన్ తీసుకున్న ఒక అహంకార పూరిత నిర్ణయానికి జనాలు జవాబిచ్చారు.

Also Read – జగన్‌కి గులక రాయి, ట్రంప్‌కి బుల్లెట్… ఎంతైనా అగ్రరాజ్యం కదా?

ఇక 151 సీట్లతో వైసీపీ కి ఎక్కిన అధికార మదంతో తన అన్న చిరంజీవిని జగన్ అవమానించిన తీరుకు నేడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జగన్ కు గుబగుయ్యమనే బదులిచ్చారు పవన్. పవన్ అనే నేను…కోసం పదేళ్ల ప్రతిపక్షవాసం చేసిన పవన్ నేటితో తనతో పాటుగా తన అభిమానుల ఆకలిని తీర్చేసారు. ఈ పండుగకు విచ్చేసిన అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి చిరు పట్ల తనకున్న గౌరవాన్ని మరోసారి చాటి చెప్పారు పవన్.

అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ అటు బాబును, ఇటు పవన్ ను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియ చేస్తున్న సందర్భంలో తన అన్న చిరు ప్రస్తావన తెచ్చి మోడీని చిరు దగ్గరకు తీసుకు వెళ్లారు పవన్. మోడీ కూడా ఒకపక్క మెగా స్టార్ ను మరో పక్క పవన్ స్టార్ ను పెట్టుకుని కూటమి విజయ గర్వాన్ని అనుభవించారు. దీనితో చిరంజీవి స్థాయి ఏమిటో ఆయన స్థానం ఎక్కడో జగన్ కు తెలిసి వచ్చేలా చేసారు పవన్.

Also Read – బాబు చాలా బిజీ… మరి మంత్రులో?

ఇలా జగన్ తన అహంతో నలుగురి మధ్య చిరుకు చేసిన అవమానానికి కొన్ని కోట్ల మంది సాక్షిగా బదులిచ్చారు పవన్ అంటూ మెగా అభిమానులతో పాటుగా సామాన్యుడు సైతం పవన్ చేసిన పనిని అభినందిస్తున్నారు. ఓటమితో కష్టంలో ఉన్నప్పుడు, అవమానాలు ఎదుర్కొన్నప్పుడు ఒక్కడే భరించిన పవన్…విజయంతో తనకు దక్కే గౌరవంలోను, మర్యాదలోను తన అన్నకు చిరు కి కూడా వాటా ఇస్తున్నాడు. అసలు కుటుంబ విలువలు అంటే ఇవి కదా జగన్ అంటూ జగన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

తనకు కష్టం వచ్చినప్పుడు, పదవి కావాలనుకున్నప్పుడు తల్లిని చెల్లిని రోడ్ల మీదకు తెచ్చిన జగన్ తనకు అధికారం దక్కగానే అదే తల్లిని, చెల్లిని రాష్ట్ర సరిహద్దుల నుండి వెళ్లగొట్టారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేసిన చెల్లికి కనీసం తనతో పాటుగా స్టేజి మీద సమాన స్థాయిని కూడా ఇవ్వలేని జగన్ అహం, అలాగే తన గెలుపు కోసం ప్రచారం చేసిన తల్లిని పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించిన జగన్ అభద్రతా ఈనాడు పవన్ చేసిన పనితో బయటపడింది.

Also Read – ఇంతకీ ఆ కేసులో కేసీఆర్‌ ఓడారా… గెలిచారా?