
విద్యార్దులకు విద్యాబుద్ధులు నేర్పడమే ఉపాధ్యాయుల బాధ్యత. కానీ కాలక్రమంగా అనేక ఇతర బాధ్యతలు కూడా అప్పగించబడుతున్నాయి. జగన్ హయాంలో మద్యం షాపుల వద్ద డ్యూటీ, పాఠశాలలో మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయడం వంటి పనులు కూడా చేయకతప్పలేదు.
గత టిడిపి ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని నిరూపించుకోవడానికి నాడు-నేడు కార్యక్రమంతో రాష్ట్రంలో కొన్ని పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పించినమాట వాస్తవం. అయితే అసలు కన్నా కొసరు ఎక్కువన్నట్లు, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోమని ప్రోత్సహించే బదులు, అలా ఉందని ఉపాధ్యాయులు ప్రతీరోజూ నిరూపించుకోమనేది జగన్ ప్రభుత్వం.
Also Read – పోలీస్ గడప దాటించి కోర్టుకి తీసుకువెళ్తే చాలు.. కేసు ఫినిష్!
ఉపాధ్యాయులు ప్రతీరోజు ఉదయం తమ పాఠశాలలో మరుగుదొడ్లకు ఫోటోలు తీసి పైఅధికారులకు అప్‌లోడ్ చేయాలని కోరుతూ ఓ యాప్ కూడా రూపొందించి అమలుచేసింది. దానిపై ఉపాధ్యాయుల అభ్యంతరాలను అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు ఆ శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందిస్తూ, “ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదు. ఈ విధానాన్ని ఆపేశాం. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలగించాం. నాణ్యమైన విద్యను పిల్లలకి అందించండి. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దండి. టీచర్ల సమస్యలన్నీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం,” అని ట్వీట్ చేశారు.
Also Read – వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు మరి ప్రభుత్వం?
దీనిపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం లేదా విద్యాశాఖ చెప్పకపోయినా ఉపాధ్యాయులు పాఠశాల పరిశుభ్రతతో సహా విద్యార్దులకు సంబందించి అన్నిటిపై శ్రద్ద చూపుతూనే ఉంటారు. కానీ ప్రభుత్వమే పాఠశాలల దుస్థితిని పట్టించుకోలేదనే వార్తలు వింటూనే ఉంటాము. ఇప్పుడు పాఠశాలల బాధ్యత ప్రభుత్వానిదే అని మంత్రి నారా లోకేష్ చెప్పడం చాలా అభినందనీయం.
ముఖ్యమంత్రి లేదా మంత్రి అయినంత మాత్రన్న ప్రతీ విషయంలో జోక్యం చేసుకోనవసరం ఉండదు. కానీ జగన్ సంస్కరణల పేరుతో విద్యారంగంతో సహా తనకు అవగాహన లేని ప్రతీ వ్యవస్థలో వేలు పెడుతూ అన్నిటినీ భ్రష్టు పట్టించేశారు.
Also Read – విశాఖ మేయర్ పీఠం కూటమికే… సంతోషమేనా?
అయినా రోజూ పిల్లలు యూనిఫారం ధరించి వచ్చారా లేదా?వారికి పుస్తకాలు, బ్యాగ్స్ అందాయా లేదా?టీచర్లు క్లాసులో పాఠాలు సరిగ్గా చెపుతున్నారా లేదా? అని తెలుసుకుంటే అందరూ హర్షించేవారు.
కానీ ప్రతీరోజూ ఉదయమే వారిని మరుగుదొడ్ల ఫోటోలు తీయమని చెప్పడం ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది? అధికారులు రోజూ డ్యూటీకి రాగానే మొదట ఆ మరుగుదొడ్ల ఫోటోలు చూడాల్సి రావడం ఎలా ఉంటుందో జగన్‌కి తెలీదు. కానీ 5 ఏళ్ళు ఈ నరకం అనుభవించిన ప్రతీ ఉపాధ్యాయుడు, ప్రతీ అధికారికి తెలుసు. అందుకే మరుగుదొడ్ల నుంచి తమకు విముక్తి కల్పించినందుకు వారు చాలా సంతోషిస్తున్నారు.
చివరిగా ఒక మాట: మరుగుదొడ్ల ఫోటోలు పంపాలని యాప్ పెట్టిన జగన్, మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులు డ్యూటీకి వచ్చారో లేదో తెలుసుకునేందుకు ఫోటోలు తీసి పంపాలని యాప్ ఎందుకు పెట్టలేదో?
ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదు. ఈ విధానాన్ని ఆపేశాం. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలగించాం. నాణ్యమైన విద్యను పిల్లలకి అందించండి. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దండి. టీచర్ల సమస్యలన్నీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత… pic.twitter.com/0HBioqEmEf
— Lokesh Nara (@naralokesh) August 6, 2024