అతడే ఒక వాలంటీర్..!

Chandrababu Naidu

అధికారం కోసం ప్రజల చుట్టూ తిరగడం అదే అధికారం వచ్చి పదవులు హోదాలు దక్కడంతో ప్రజలను దూరంగా పెట్టడం చూసిన ప్రజలు ఈ సారి మార్పు కోరుకున్నారు. అయితే ఇప్పుడా మార్పును స్పష్టంగా చూపిస్తుంది కూటమి ప్రభుత్వం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నేతలందరూ ప్రజా సమస్యలు వినడానికి వాటి పరిష్కారానికి నేరుగా బాధ్యత వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ మొదలుకుని ఐటీ మంత్రి లోకేష్ వరకు అందరు ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు.

ADVERTISEMENT

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వారంలో ఒక రోజు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అక్కడ నేరుగా ప్రజా సమస్యలు వినడానికి నిశ్చయించుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి అడుగు బయటకు పెడితే జనసమూహానికి దూరంగా పరదాల మాటున గుట్టుగా వచ్చి గుట్టుగా వెళ్లిపోయే వారు.

ఆ సంస్కృతీకి సమాధి కట్టి మంత్రులైన, ముఖ్యమంత్రైనా ప్రజల సేవకులే అంటూ తన ప్రమాణస్వీకారం రోజే తెలియ చేసిన బాబూ ఇప్పుడు దాన్నే అమలు చేసి చూపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తమ పార్టీ కార్యకర్తలకు ప్రజల డబ్బును జీతాలుగా ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను సృష్టించి పెన్షన్లను ఇంటికే డోర్ డెలివరీ చేశారు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాలంటీర్ వ్యవస్థ పై ఒక నిర్ణయానికి రాకపోవడంతో వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పిన్షన్లు పంపిణి చేయాలనీ ఆదేశించారు బాబు. ఏప్రిల్ నెలతో కలిపి పెరిగిన మూడు నెలల పిన్షన్ ను జులై లో విడుదల చేస్తాం అంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు జులై నెలలో మనిషికి 7 వేలు చప్పున పిన్షన్ అందనుంది.

ఈ పిన్షన్ అందించే కార్యక్రమంలోకి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబే పాల్గొనడానికి నిశ్చయించుకున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి బాబు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ పంపణీ చేయనున్నారు. దీనితో దేశ చరిత్రలోనే పెన్షన్ పంపణీ చేసిన మొదటి ముఖ్యమంత్రిగా బాబు మరో అరుదైన గౌరవం అందుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో తమ ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోతే ఇప్పటి వరకు పేదవాడికి అందించే సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటి గడపను తాకవు అంటూ ప్రజలను హెచ్చరించిన జగన్ వ్యాఖ్యలను పటాపంచలు చేస్తూ కూటమి ప్రభుత్వంలో నేరుగా ముఖ్యమంత్రే పెంషన్ల పంపణీకి అడుగు ముందుకేయడంతో వైసీపీ సృష్టించిన వాలంటీర్ వ్యవస్థకు చెక్ పెట్టినట్టయ్యింది.

దీనితో ప్రజల కోసం అతడే ఒక వాలంటీర్ అంటూ బాబు నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. పరదాలు కట్టుకుని, చెట్లను నరికేస్తూ, దుకాణాలు మూసేస్తూ, సభల పేరున కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ, ప్రచారానికి వందల కోట్లు తగలేస్తూ గాలిలో వచ్చి గాలిలో వెళ్లి బటన్ నొక్కాను అంటూ హంగామా చేసిన జగన్ ఇప్పుడు ఎం సమాధానం చెపుతారు అంటూ నిలదీస్తున్నారు కూటమి మద్దతుదారులు.

ADVERTISEMENT
Latest Stories