మిగ్‌జామ్ తుఫానుతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, ఉమ్మడి గోదావరి జిల్లాలలో తీవ్రంగా పంటనష్టం జరిగింది. వేలాది ఎకరాలలో పంటలు నీట మునిగాయి. మామిడి, కొబ్బరి, అరటి తదితర చెట్లు నెలకొరిగాయి. తుఫాను, ఈదురుగాలుల కారణంగా అనేకమండి పేదల ఇళ్ళు చిన్నా భిన్నమయ్యాయి.
తుఫాను ప్రభావిత ప్రాంతాలలో కరెంటు స్తంభాలు, చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడి ఉన్నాయి. అనేక చోట్ల రోడ్లు వరదలో కొట్టుకుపోయాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. ఓ వైపు తుఫాను దెబ్బ, మరోవైపు పంట నష్టం, ఇటువంటి కష్టాలతో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ, అవి ఏమాత్రం సరిపోవడం లేదు.
ప్రభుత్వమూ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఇటువంటి సందర్భాలలో ప్రజల మద్యన ఉండాలి. కానీ ప్రజలు నానా ఇక్కట్లు పడుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తుంటే, ముఖ్యమంత్రి జగన్ ఇంద్రకీలాది అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. వివిద జిల్లాలలో మంత్రులు బస్సులు వేసుకొని సామాజిక సాధికార యాత్రలు చేసుకొంటున్నారు!
వైసీపి ప్రభుత్వం తీరు చూస్తుంటే రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి తాపీగా ఫిడేల్ వాయించుకొన్నట్లుందనిపించక మానదు.
ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించడంలో జాప్యం జరుగుతున్నా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు టిడిపి నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ తుఫాను బాధితులకు యధాశక్తిన సహాయపడుతున్నారు. బాధిత కుటుంబాలకు మంచినీళ్ళు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.
పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు స్వయంగా జేసీబీలు వగైరా యంత్రాలను వెంటబెట్టుకొని వచ్చి రోడ్లకు అడ్డంగా పడున్న చెట్లను కత్తిరించి పక్కకు తొలగిస్తున్నారు.
ఇటువంటి సందర్భాలలో ఎప్పుడూ ముందుండే టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తుఫాను మొదలైన రోజున రాత్రంతా గ్రామాలలో తిరుగుతూ గ్రాంస్తులకు ధైర్యం చెప్పారు. మళ్ళీ మర్నాడు ఉదయమే బోరున కురుస్తున్న వానలో గొడుగు వేసుకొని వెలివెల, సాలివాడ, తిల్లపూడి గ్రామాలలో తిరుగుతూ విద్యుత్, మునిసిపల్ తదితర అధికారులతో మాట్లాడి సహాయచర్యలు వేగవంతం చేయించారు.
హూద్ హూద్ తుఫాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అతికష్టం మీద విశాఖ నగరానికి చేరుకొని అక్కడే 10 రోజులు బస చేసి సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఆయన చొరవ తీసుకోవడం వలననే కేవలం మూడు వారాలలో విశాఖ నగరం మళ్ళీ గాడిన పడిందని విశాఖ నగరవాసులే నేటికీ చెప్పుకొంటుంటారు.
ఇప్పుడు కూడా ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించేందుకు బయలుదేరుతున్నారు. శుక్రవారం వేమూరు, తెనాలి, బాపట్ల, శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాలలో పర్యటించి దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, బాధిత కుటుంబాలను, రైతులను కలిసి ధైర్యం చెప్పి వారికి టిడిపి తరపున యధాశక్తిన సహాయం అందించబోతున్నారు.
ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు ముందుండి సహాయ చర్యలు చేపట్టాల్సి ఉండగా, ప్రతిపక్ష పార్టీ నేతలు ముందుకు వచ్చి ప్రజలకు సహాయపడుతున్నారు. టిడిపి, వైసీపిల పనితీరు, నిబద్దతకు ఇంత కన్న గొప్ప కొలమానం ఏముంటుంది?
#నేనున్నానుబయపడకండి…
జోరు వానలోనే అర్ధరాత్రి తుఫాన్ బాధితులకు అండగా తోడుగా……తుఫాను ఉపద్రవానికి మంగళవారం రాత్రి భారీ వర్షం, పెద్ద ఎత్తున సుడిగాలికి వెలివెల, సాలివాడ, తిల్లపూడి గ్రామాల్లో నివాస ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుస్తంభాలు, వందలాది కొబ్బరి చెట్లు… pic.twitter.com/GcNR1HYjjb
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) December 6, 2023






